జిసిసి ప్రయాణీకులకు జెట్ ఎయిర్‌వేస్ ఆఫర్లు
- April 28, 2017
మూడు రోజుల వెబ్ బేస్డ్ సేల్ ఆఫర్‌ని ఇండియన్ ఎయిర్‌లైన్ జెట్ ఎయిర్ వేస్ ప్రకటించింది. జిసిసి ప్రయాణీకుల కోసం 12 శాతం ఫ్లాట్ డిస్కౌంట్‌తో టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చింది. 'పే డే ప్రోమో' పేరుతో జెట్ ఎయిర్‌వేస్ వెబ్‌సైట్‌లో మొబైల్ యాప్ ద్వారా ఈ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ 29 నుంచి మే 1 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ముందుగా వచ్నివారికి ముందుగా అనే ప్రాతి పదికన ఈ ఆఫర్ ప్రకటించారు. టిక్కెట్లను ఏప్రిల్ 1 నుంచి మే 1 వరకు కొనుగోలు చేసినా, ఆ తర్వాతి కాలంలో ఎప్పుడైనా వాటిని వినియోగించుకోవచ్చు. ఇండియాతోపాటుగా బ్యాంకాక్, హాంగ్‌కాంగ్, సింగపూర్, కొలంబో, ఢాకా మరియు కాఠ్మండులకూ ఈ ఆఫర్ వర్తిస్తుంది.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







