ఉద్యమకారుడి నిరాహారదీక్ష
- April 28, 2017
ప్రముఖ బహ్రెయినీ ఉద్యమకారుడొకరు, ప్రిజనర్స్ని, క్యాంపెయినర్స్ని ట్రీట్ చేస్తున్న విధానంపై నిరసనగళం విప్పుతూ రెండు వారాలపాటు నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నందుకుగాను అబ్దుల్‌హాది అల్ ఖ్వాజాకి ఇప్పటికే న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఇతనికి డానిష్ పౌరసత్వం కూడా ఉంది. ఏప్రిల్ 12వ తేదీన మనామా ప్రిజన్లో నిరాహార దీక్ష చేపట్టాడాయన. ఖ్వాజా ఇప్పటిదాకా ఇలాంటి నిరాహార దీక్షలు నాలుగు సార్లు చేశాడు, ఇది ఐదవది. షియా మెజార్టీ గల బహ్రెయిన్ 2011 నుంచి పలు రకాలైన ఆందోళనలతో దద్దరిల్లుతోంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న పలువురు జైళ్ళలో మగ్గుతున్నారు. రజాబ్ అనే ప్రముఖ ఉద్యమకారుడికి ఇటీవలే సర్జరీ జరిగింది. ఆయన ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
తాజా వార్తలు
- గల్ఫ్ ఎయిర్ టేకాఫ్ సేల్..తక్కవ ధరలకే 150,000 టిక్కెట్లు..!!
- సులైబిఖాట్ బీచ్‌లో ఫోటోగ్రాఫర్లపై ఆంక్షలు..!!
- ట్రావెల్ అండ్ టూరిజం సంస్థకు OMR15,815 ఫైన్..!!
- అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు..మార్చిలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా?
- డిజిటల్ ఆడిటర్ కార్డును ప్రారంభించిన ఖతార్..!!
- "చెక్ యువర్ హెల్త్" క్యాంపెయిన్..నిమిషాల్లో 10 పరీక్షలు..!!
- భారత్‌కు ట్రంప్ షాక్..
- లండన్‌లో అగ్నిప్రమాదం..తెలుగు యువకుడు మృతి
- ఉద్యోగాలకు దరఖాస్తు గడువు నేటితో ముగింపు!
- టైటానియం, రేర్ ఎర్త్ రంగాల్లో ఆంధ్రప్రదేశ్‌కు కొత్త దిశ: మంత్రి కొల్లు రవీంద్ర









