జోర్డాన్ పార్లమెంట్ ఎంపీ మాజెన్ దలాయిన్ కుమారుడు ఐఎస్ లో చేరాడు
- October 04, 2015
తన కుమారుడు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థలో చేరాడని జోర్డాన్ పార్లమెంట్ సభ్యుడొకరు బాంబు పేల్చారు. అంతేకాదు ఇరాక్ లో ఆత్మాహుతి దాడికి కూడా పాల్పడ్డాడని వెల్లడించారు. 23 ఏళ్ల తన కుమారుడు మహ్మద్.. ఐఎస్ లో చేరాడని జోర్డాన్ ఎంపీ మాజెన్ దలాయిన్ తెలిపారు. ఉక్రెయిన్ లో మెడిసిన్ చదువుతున్న అతడిని జూన్ నెలలో చివరిసారిగా చూశామని అసోసియేటెడ్ ప్రెస్ తో చెప్పారు. టర్కీ, సిరియా మీదుగా అతడు ఇరాక్ వెళ్లాడని వెల్లడించారు. అతడిని నిలువరించేందుకు తాము చేసిన ప్రయత్నాలు ఫలించలేదని ఆయన వాపోయారు. తమ కుమారుడు మీతి చెందినట్టు శనివారం గుర్తించామని చెప్పారు. ఇరాకీ ఆర్మీ పోస్టుపై జరిగిన ఆత్మహుతి దాడిలో చనిపోయిన ముగ్గురు ఫొటోలను ఐఎస్ వెబ్ సైట్ లో పెట్టిందని, అందులో తమ కుమారుడు ఉన్నాడని మాజెన్ దలాయిన్ వివరించారు.
తాజా వార్తలు
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC







