ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు మృతి
- October 04, 2015
ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు(81) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ స్టార్ ఆస్పత్రిలో ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఏడిద నాగేశ్వరరావు భౌతికకాయాన్ని బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబర్ 8లోని ఆయన స్వగృహానికి తరలించారు. 1934లో జన్మించిన ఆయన పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అనే సినీ నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ బ్యానర్ ద్వారా ఎన్నో విజయవంతమైన చిత్రాలను నిర్మించి పేరు ప్రఖ్యాతులు గడించారు. ఆయన నిర్మించిన చిత్రాల్లో కొన్ని.. ఆపద్బాంధవుడు (1992) స్వరకల్పన (1989) స్వయంకృషి (1987) సిరివెన్నెల (1986) స్వాతిముత్యం (1985) సాగర సంగమం (1983) సితార (1983) సీతాకోకచిలుక (1981) తాయారమ్మ బంగారయ్య (1979) శంకరాభరణం (1979) సిరిసిరిమువ్వ (1978).
రేపు సాయంత్రం టోలిచౌకిలోని మహాప్రస్థానం శ్మశానవాటిక లో అంత్యక్రియలు జరగనున్నాయి.
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







