వేడెక్కిస్తున్న వెబ్‌సిరీస్
- April 29, 2017
సినిమా కన్నా చిన్నది. సీరియల్ కంటే కొంచెం చిన్నది. కానీ ప్రేక్షకుల్ని మాత్రం తెగ ఆకర్షిస్తోంది. ఏ మొబైల్లో చూసినా దాని పలకరింపులే. ఏం కంప్యూటర్లో చూసినా దాని సందడే. నిడివి తక్కువే కానీ వినోదానికి హద్దులేదు. యువత ధోరణి, ప్రేమికుల గిల్లికజ్జాలు, కుటుంబంలో చిన్నచిన్న తీపి గొడవలు.. ఇలా ఒకటేంటి.. మొత్తం సమాజాన్ని తనలో ఇముడ్చుకుంటోంది. ఇంత చెప్పడం ఎందుకు ప్రస్తుతం మనుషులు ప్రపంచాన్ని చూస్తున్న కొత్త కిటికీ అది. అవును నిజమే.. మీరు అనుకుంటున్నదే. ఏ కాస్త సమయం చిక్కినా మీరు చూస్తున్న 'వెబ్‌సిరీస్' గురించే. మన మధ్య జరుగుతున్న అంశాలతో తెరకెక్కే ఈ వెబ్‌సిరీస్‌లు మీకే కాదు సినిమా జనాల్ని కూడా ఆకట్టుకుంటున్నాయి. బాలీవుడ్లో ఈ ట్రెండ్ కొన్నేళ్లుగా ఉంది. యశరాజ్ ఫిల్మ్స్ వంటి పేరుగాంచిన నిర్మాణ సంస్థలు కూడా 'వెబ్సీరి్స'లు రూపొందించి సక్సెస్ చేశాయి. ప్రజెంట్ ఈ ట్రెండ్ టాలీవుడ్లో కూడా హల్చల్ చేస్తోంది. సినిమా ప్రచారాలకు కూడా ఈ మాధ్యమం బాగానే ఉపయోగపడుతుంది.
మన సినీ ప్రముఖులు కూడా వెబ్‌సిరీస్ ట్రెండ్ వైపు ఓ లుక్కేస్తున్నారు. మరి.. మీరూ ఓ లుక్కేయండి. రానున్న రోజుల్లో వెబ్‌సిరీస్ హవానే నడుస్తుందని ఇటీవల ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఓ కార్యక్రమంలో అన్నారు.
అవును అది నిజమే. ఈ జనరేషన అంతా ఎక్కువ సమయం గడిపేది ఇంటర్నెట్ మీదే. బస్సుల్లో, పార్కుల్లో, ఇంట్లో ఎక్కడైనా ఖాళీ దొరకిన ప్రతిసారి 'యూట్యూబ్', లేదంటే ఎంటర్టైనమెంట్ యాప్‌లతో టైమ్‌పాస్ చేస్తున్నారు నేటి యువత. పైగా ఇప్పుడు ఇంటర్నెట్ చార్జీలు కూడా తక్కువే కదా.
స్మార్ట్ ఫోన ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రపంచం అరచేతిలో ఉన్నట్లే. సింపుల్‌గా వెబ్‌సిరీస్ గురించి చెప్పాంటే.. ఇది కూడా ఓ సీరియల్లాంటిదే. టీవీల్లో కాకుండా ఆనలైనలో ప్రసారమవుతుంది.
నిడివి ఎక్కువ కాబట్టి ఒక్కో సీరి్సని 10 నుంచి 20 ఎపిసోడ్లుగా విభజించి వారానికో, రెండు వారాలకో ఒక్కో ఎపిసోడ్ విడుదల చేస్తుంటారు. ఎపిసోడ్‌కి 15 నుంచి 20 నిమిషాల నిడివి ఉంటుందంటే. టీవీ సీరియల్లాగా ఏడుపు పెడబొబ్బలుండవు, సాగదీతకు ఛాన్సేలేదు. షార్ట్ అండ్ స్వీట్ అంతే.
ఇక్కడ వీక్షకులకు వినోదం పంచడం మాత్రమే మేకర్స్ లక్ష్యం. సిరీస్ ఇంట్రెస్టింగ్గా ఉందంటే లక్షల్లో వ్యూవర్షిప్ ఉంటుంది. మూడునాలుగేళ్లగా సినిమాకు సంబంధంలేని ఆర్టి్‌స్టలు చేసిన వెబ్‌సిరీ్‌సలు మాత్రమే యప్‌టీవీ, విఐయు యాప్, యూట్యూబ్‌లో సందడి చేశాయి. వాటికొస్తున్న ఆదరణతో సినిమా వాళ్లు మేం కూడా ఆనలైనలో సందడి చేస్తాం అంటూ వెబ్సిరీ్సవైపు దృష్టి మళ్లించారు.
వెబ్‌సిరీస్ కోసం దర్శకురాలు నందినీరెడ్డి ఓ కథ రాశారు. త్వరలోనే అది పట్టాలెక్కబోతుంది. నీహారిక కొణిదెల నటించిన 'ముద్దపప్పు అవకాయ్' యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. పెళ్లి, కుటుంబ కథతో తెరకెక్కిన ఆ సీరిస్ లక్షల సంఖ్యలో వ్యూవ్స్ సొంతం చేసుకుంది.
'నేను మీ కల్యాణ్' సిరీ్‌సలో సాయిధరమ్‌తేజ్ అతిథి పాత్రలో అలరించారు. తాజాగా 'ఎందుకిలా', 'పిల్లా', 'పెళ్లి గోల', 'పాష్ పోరీస్', 'నేను మీ కల్యాణ్' వంటి సిరీ్‌సలో ఆనలైన వీక్షకులకు కావలసినంత వినోదాన్ని పంచుతున్నాయి. వినోదమే కాకుండా హారర్ థ్రిల్లర్, సామాజిక కథలు కూడా అలరిస్తున్నాయి. సుమంత 'ఎందుకిలా'.. ''అతని పేరు ధనుష్ రిషి.
అందరూ ధరి అనిపిస్తారు. అతని తండ్రి మాత్రం 'దరిద్రుడా' అని పిలుస్తాడు. దేవుడికి అతనిపై ఉన్న క్లారిటీ, బ్యాడ్లక్పై ఇతనికున్న గ్రావిటీ గురించి ధరికి చిన్నప్పటి నుంచే తెలుసు. బ్యాడ్‌లక్ అతని చుట్టూ వైపైలా ఉంటుందని అతని తండ్రి నమ్మకం'.
ప్రస్తుతం ఈ డైలాగ్ టీజర్ ఇంటర్నెట్ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఎమ్మెస్ రాజు తనయుడు సుమంత అశ్విన నటించిన 'ఎందుకిలా' వెబ్‌సిరీ్‌సలో డైలాగ్ ఇది. దర్శకుడు దేవా కట్టా సమర్పణలో యప్‌టీవీ సంస్ధ నిర్మిస్తోంది. లక్ష్మణ్ కార్య దర్శకుడు.
హీరోగా కొనసాగుతూనే కంటెంట్ ఎగ్జైటింగ్‌గా ఉందని సుమంత అశ్విన ఈ సిరీస్ చేశారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథలుంటే భవిష్యత్తులో కూడా సుమంత సిరీస్ కొనసాగిస్తా అంటున్నారు. కంట్రోల్ చేసుకోలేని ఉద్వేగాలతో.. 'జీవితంలో మరచిపోలేని భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేని ముమెంట్స్ కొన్ని ఉంటాయి. అలాంటి ముమెంట్తో ఒక యువతి జీవితం తలకిందులైంది' అందుకు ఎవరు కారణమన్న కథాంశంతో పవన సాధినేని ('ప్రేమ ఇష్క్ కాదల్', 'సావిత్రి' చిత్రాల ఫేం) దర్శకత్వం వహించిన 'పిల్లా' వెబ్‌సిరీస్ ఇంటర్నెట్ వైరల్‌గా మారింది.
ధన్యబాలకృష్ణన నటించిన ఈ సిరీస్ హారర్ థ్రిల్లర్‌గా, యువతను ఆలోచింపజేసే పాయింట్‌తో తెరకెక్కింది. ఏందీ పెళ్లిగోల... ఓ యువకుడు పెళ్లి నుంచి ఎలా తప్పించుకోవాలన్న లైనతో 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' ఫేం అభిజీత, షామిలి జంటగా నటించిన 'పెళ్లిగోల' ఆనలైనలో ప్రత్యక్షమైన అతితక్కువ సమయంలో నెటిజన్ల ఆదరణ పొందింది. మల్లిక్‌రామ్ దీనికి దర్శకుడు. అన్నపూర్ణ స్టూడియో్సతో కలిసి వ్యూ (విఐయు) సంస్థ నిర్మించింది.
కథను బట్టి బడ్జెట్ కథ డిమాండ్‌ను బట్టే బడ్జెట్ ఉంటుంది. ఒక ఎపిసోడ్ రూ.మూడు లక్షలు కావచ్చు. సీరిస్ మొత్తం మూడు, నాలుగు లక్షల్లో పూర్తి కావచ్చు. కొన్ని సందర్భాల్లో ఒక్క ఎపిసోడ్‌కి రూ.30 లేదా 40 లక్షలు ఖర్చుకావచ్చని మేకర్స్ చెబుతున్నారు.
యప్‌టీవీ, విఐయు, యూట్యూబ్ వంటి మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి రిలీజ్‌కి ఇబ్బంది ఉండదనీ, రిలీజ్ ఖర్చు కూడా తక్కువగానే ఉంటుందనీ వారంటున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థల ఆసక్తి ఇప్పటికే బాలీవుడ్లో వెబ్‌సిరీస్ ట్రెండ్ తారాస్థాయికి చేరుకుంది. 'ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్', 'త్రీ ఇడియెట్స్' ఫేం అలీ ఫాజిల్ 'బ్యాండ్ బాజా బరాత', పరిణీతి చోప్రా 'మ్యాన్స వరల్డ్' వంటి సిరీ్‌సలో కనిపించి అలరించారు. రిచా చద్దా, కల్కి కొచ్లిన, రియా చక్రబోర్తి, భూమి ఫడ్నేకర్ కూడా వెబ్‌సిరీ్‌సలో భాగమయ్యారు.
మిలటరీ నేపథ్యంలో సాగే ఓ వెబ్‌సిరీ్‌సలో నటిస్తానని ఇటీవల కబీర్ఖాన వెల్లడించిన విషయం తెలిసిందే. బిగ్‌బి అమితాబ్బచ్చన కూడా ఈ వైపు ఆసక్తిగా ఉన్నారని సమాచారం. బాలీవుడ్‌కి చెందిన యశరాజ్ ఫిల్మ్ సంస్థ ఇప్పటికే పలు సిరీ్‌సలను నిర్మించింది., మహేశభట్ వంటి నిర్మాతలకు కూడా ఆసక్తిగా ఉన్నారు. వెబ్‌సిరీస్ ప్రారంభం అవుతున్న తరుణంలోనే అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ వీటిపై ఓ కన్నేసింది.
ఇప్పటికే కొన్ని సిరీ్‌సలను నిర్మించింది కూడా. మరో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ కూడా వెబ్సిరీ్సలోకి అడుగుపెట్టనుంది. కథ, కథనాల్లో దమ్ముండి, తెరపై ఎవరు కనిపించినా ప్రేక్షకులు చూస్తారనే నమ్మకం ఉంటే వెబ్‌సిరీస్ వైపు అడుగేయడం మంచిదనీ. ఇది లాభదాయకమైన మార్గమేనని పలువురు సినిమా నిర్మాతలు చెబుతున్నారు.
పెద్ద నిర్మాణ సంస్థలే కాకుండా చిన్న సంస్థలు, పాషనతో కొందరు వెబ్‌సిరీస్ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పుడిప్పుడే సింగర్‌గా వెలుగులోకొస్తున్న పృథ్వీచంద్ర రాడ్ ఫ్యాక్టరీ పేరుతో ఓ ప్రొడక్షన హౌస్, య్యూట్యూబ్ ఛానల్ లాంచ చేసి ఎంటర్టైనమెంట్తోపాటు సమాజాన్ని ప్రభావితం చేసే కథలతొ కొన్ని సిరీ్‌సలను రూపొందించారు. అవి కూడా యూట్యూబ్‌లో చక్కని ఆదరణ పొందుతున్నాయి. కథలో దమ్ముండాలి- సుమంత అశ్విన ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో ఎన్నో సిరీ్‌సలు చూసి ఇలాంటిది మన దగ్గరకూడా లాంచ అయితే బావుండును అనుకున్న సందర్భంలో యప్‌టీవీ సంస్థ వెబ్‌సిరీస్ చెయ్యడానికి ముందుకొచ్చింది.
వాళ్లు నన్ను అప్రోచ అయినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యా. స్ర్కిప్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించడంతో 'ఎందుకిలా' సిరీస్ చెయ్యడానికి అంగీకరించా. కథలో దమ్ముంటే సినిమాకు ఏమాత్రం తగ్గకుండా తెరకెక్కించొచ్చు. సినిమాకు ఉపయోగించే కెమెరాలనే ఇక్కడ వాడాం.
వీటిని తక్కువ బడ్జెట్లో చెయొచ్చు. సినిమాల రేంజ్లోనూ చెయొచ్చు. వెబ్‌సిరీస్ వల్ల సినిమాకొచ్చిన నష్టం ఏమీలేదు. నేటియువతకు క్విక్ ఎంటర్టైన్మెంట్ అందించడం కోసం ఇదొక ప్రయత్నం.
ప్రతిభ ఉన్న ఆర్టి్‌స్టలకు, దర్శకులకు ప్రూవ్ చేసుకోవడానికి వెబ్‌సిరీస్ మంచి ప్లాట్‌ఫామ్ అవుతుంది. భవిష్యత్తులో వెబ్‌సిరీస్ మంచి స్థానంలో ఉంటుందని నా నమ్మకం. దర్శకులకు మంచి అవకాశమిది-పవన సాధినేని సుత్తి లేకుండా సూటిగా ఏది చెప్పినా ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారు. కొన్ని పరిమితుల దృష్ట్యా సినిమాలో అన్నీ చెప్పలేము.
కొన్ని సందర్భాల్లో మంచి సన్నివేశాలు కూడా కట్ చెయ్యాల్సి వస్తుంది. వెబ్‌సిరీ్‌సలో అలాంటి పరిమితులేమీ ఉండవు దర్శకుడు చెప్పాలనుకున్నది సూటిగా చెప్పొచ్చు. కొత్తకొత్త ప్రయోగాలు చెయ్యొచ్చు. రిలీజ్‌కి ఇబ్బందులుండవు.
స్మార్ట్ ఫోన చేతిలో ఉన్న ఉన్న ప్రతి ఒక్కరికీ ఎంటర్టైనమెంట్ ప్రతిక్షణం అందుబాటులో ఉంది. నెట్‌కి కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ వీటికి కనెక్ట్ అవుతారు. భవిష్యత్తుల్లో రానున్న ఫిల్మ్మేకర్స్కి మంచి పునాది ఇది. అదే మా టార్గెట్- దేవా కట్టా మొదటి ప్రాజెక్ట్ కాబట్టి ట్రయల్ వర్షనగా మనకు పరిచయమున్న కథతో 'ఎందుకిలా' సిరీస్ చేశాం.
రానున్నరోజుల్లో నెట్‌ఫ్లిక్స్‌లో 'బ్రేకింగ్ బ్యాడ్', 'హౌస్ ఆఫ్ కార్డ్స్' ఇన్సపిరేషనతో ఆసక్తికరమైన కంటెంట్ తీసుకురాబోతున్నాం. ప్రస్తుతం పైప్ లైనలో రెండు కథలున్నాయి. నా దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన పణి 'ప్రస్థానం'లో పాత్రలను ఆధారంగా తీసుకుని 'ఇంద్రప్రస్థం' చేస్తున్నాడు. 'బ్రేకింగ్ బ్యాడ్' ఫార్మెట్లో 20 ఎపిసోడ్స్ ప్లాన చేస్తున్నాం.
మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో మరో సిరీస్ రెడీ చేస్తున్నాం. రొటీనగా వచ్చే రొమాంటిక్ కామెడీ కథల్ని వెబ్సిరీ్సకి తీసుకొస్తే మెయిన స్ర్టీమ్ సినిమాకు కథలు బలపడతాయనీ, కొత్త కథలు వస్తాయనీ మా ఉద్దేశం. ప్రస్తుతం మా టార్గెట్ ఇదే. సినిమాల్లో మనం చెయ్యలేని కాన్సె్ప్టలన్నీ ఇక్కడ చూపించొచ్చు.
కంటెంట్, ఐడియా సా్ట్రంగ్గా ఉంటే బడ్జెట్‌తో సమస్యలేదు. సినిమాల్లోకి రావాలనుకునే వాళ్లకి ఇదొక మంచి వేదిక అవుతుంది. వెబ్‌సిరీస్ సక్సె్సకి కంటెంట్ ఎగ్జైటింగ్‌గా ఉంటే చాలు. జనాల్లోకి దూసుకెళ్లొచ్చు.
ఆకాశమే హద్దు- నందినీరెడ్డి కథను నమ్మి నిర్మాత ఓ ఫీచర్ సినిమా చేస్తే.. 'డిసి్ట్రబ్యూటర్లు కొంటారా? థియేటర్లు దొరుకుతాయా? శాటిలైట్ వస్తుందా?
ఫలానా హీరోతో వర్కవుట్ అవుతుందా? సినిమా బాగా ఆడుతుందా? ఇలాంటి వంద ఆలోచనలు వెంటాడుతున్నాయి. కానీ మనల్ని మనం నిరూపించుకోవడానికి ఇక్కడొక ప్లాట్‌ఫామ్ రెడీ ఉంది.
వెబ్‌సిరీస్ వల్ల అడ్వాంటేజ్ ఉంది. ప్రజెంట్ కంట్రోల్ బటన అనేది వ్యూవర్ చేతిలోకి వెళ్లిపోయింది. వాళ్లకు ఏది నచ్చితే అదే చూస్తారు. కావాలనుకున్నది చేస్తారు.
ఆనలైనలో దొరికే కొత్త కంటెంట్‌తో వ్యూవర్స్‌కి చాయిస్ పెరుగుతుంది. దర్శకులకు, రచయితలకు, నిర్మాతలకు, ఆర్టి్‌స్టలకు కథలో వైవిధ్యం అద్భుతంగా కనిపిస్తుంది. ఉదాహరణకు ఓ హీరోకి సక్సె్సలు లేవు. వెబ్‌సిరీ్‌సలో అతను నిరూపించుకుంటే మళ్లీ సినిమాల్లో సక్సెస్ పొందే అవకాశం ఉంది.
వెబ్‌సిరీ్‌సలో హిందీ పరిశ్రమ చాలా ముందుకు దూసుకుపోయింది. హోమో సెక్సువల్ రొమాన్స, హిస్టారికల్ ఇలా రకరకాల కథలతో ప్రయోగాలు చేస్తున్నారు. టాలీవుడ్లో ఇప్పుడిప్పుడే బుజ్జిబుజ్జి అడుగులు వేస్తున్నాం కాబట్టి ఎంటర్టైనమెంట్, రొమ్‌కామ్ మెయినగా తీసుకుంటున్నారు. రానున్న రోజుల్లో థ్రిల్లర్ బయోపిక్, సోషల్ ఇష్యూ ఏదైనా చెయ్యొచ్చు.
సినిమా అనగానే కొన్ని పరిధులుంటాయి. ఇక్కడ పరిధి ఏమీ లేదు. స్కై ఈజ్ ద లిమిట్. ప్యూర్ కంటెంట్ మీద నడుస్తుంది తప్ప సీరియల్లాగా సాగదీత ఉండదు.
సాలిడ్ కంటెంట్ ఉంటే చిన్న నటులతోపాటు పెద్దపెద్ద నటుడు కూడా చేసే అవకాశం ఉంది. హిందీలో కూడా పెద్ద పెద్ద పేర్లు వినబడుతున్నాయి. అమితాబ్బచ్చన కూడా వెబ్‌సిరీస్ చెయ్యబోతున్నారని విన్నాను. మన దగ్గర సక్సెస్ కావడానికి కొంత టైమ్ పడుతుంది.
ప్లాట్పామ్ ఉంది కదా అని ఏదిపడితే అది తీస్తే ప్రేక్షకులు క్షమించరు. సృజనాత్మకతతో ముందుకెళ్లాలి. వెబ్‌సిరీస్ కోసం నేను కూడా ఓ కథ రాశా. రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ అది.
శశాంక్ ఏలేటి దర్శకత్వం వహిస్తున్నారు తేజస్వీ మదివాడ కథానాయకగా నటిస్తోంది. ప్యూచర్లో నేను కూడా చేసే అవకాశం ఉంది. ఆలపాటి మధు
తాజా వార్తలు
- ఆహార పదార్థాల కల్తీపై నిరంతర నిఘా ఉంచాలి: సీఎం చంద్రబాబు
- యూత్ సెంటర్.. సుల్తాన్ సుల్తాన్ రాయల్ డిక్రీ..!!
- అబుదాబి బిగ్ టికెట్: ఇండియా, బంగ్లాదేశ్ నుంచి నలుగురు విజేతలు..!!
- సహజ వనరుల రక్షణకు అమీర్ పిలుపు..!!
- సౌదీయేతర వ్యక్తిని నియమించుకుంటే SR10,000 జరిమానా..!!
- ‘బెస్ట్ ఆఫ్ హ్యాపీనెస్’ బస్ టూర్‌కు సర్వం సిద్ధం..!!
- 7 రోజుల్లో 27వేల ఉల్లంఘనలు..1,770 ప్రమాదాలు నమోదు ..!!
- విద్యాశాఖ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక సమీక్ష
- గూగుల్ మ్యాప్స్‌లో ఆధార్ కేంద్రాల వివరాలు
- కోల్‌కతా మెట్రోలో సరికొత్త బ్యాటరీ వ్యవస్థ









