టెక్సాస్ జైల్లో ఇండో-అమెరికన్‌

- April 30, 2017 , by Maagulf
టెక్సాస్ జైల్లో ఇండో-అమెరికన్‌

అమెరికాలో తను పని చేసే సంస్థ సొమ్మునే నొక్కేసినందుకు, ఓ బ్యాంకును మోసగించినందుకు 45 ఏళ్ళ కిరణ్ అంధవరపు అనే ఇండో-అమెరికన్‌కు జైలు శిక్ష పడింది. టెక్సాస్‌లోని డిస్ట్రిక్ట్ కోర్టు అతనికి 20 నెలల జైలుశిక్ష విధించింది. జైలు నుంచి విడుదలయ్యాక అతని ప్రవర్తనపై మూడేళ్ళు పర్యవేక్షణ ఉండాలని న్యాయమూర్తి కీత్ పి.ఎలిసన్ తీర్పునిచ్చారు.
టెక్సాస్‌లోని కోన్రో సిటీలో ఉంటున్న కిరణ్-అక్కడి వెదర్ ఫోర్డ్ అనుబంధ సంస్థ ఈ-ప్రొడక్షన్ సొల్యుషన్స్‌లో పని చేసేవాడని తెలిసింది. అయితే ఇదే సంస్థ పేరిట బ్యాంకు అకౌంట్లు తెరిచి తనను సంస్థ యజమానిగా నమోదు చేసుకున్నాడు. తన కంపెనీ అసలు యజమాని పేరిట ఉన్న చెక్కులను దొంగిలించి ఆ మొత్తాన్ని తన ఖాతాలో జమ చేసుకునే వాడు. ఇలా సుమారు 4.84 లక్షల డాలర్లు (3.11 కోట్లు) కాజేశాడని, గత ఫిబ్రవరి 9న తన నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com