డెవలప్మెంట్ ఫౌండేషన్ని ప్రారంభించిన షేక్ మొహమ్మద్

- October 04, 2015 , by Maagulf
డెవలప్మెంట్ ఫౌండేషన్ని ప్రారంభించిన షేక్ మొహమ్మద్

యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ కొత్త ఫౌండేషన్ని ప్రారంభించారు. ఈ ఫౌండేషన్ ద్వారా ఛారిటీ కార్య్యక్రమాలు నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం 270 మిలియన్ డాలర్లను కేటాయిస్తారు. 116 దేశాల్లోని 130 మిలియన్ ప్రజలకోసం ఈ ప్రాజెక్ట్ని రూపొందించినట్లు చెప్పారు షేక్ మహమ్మద్. ప్రధానంగా అరబ్ ప్రపంచానికి ఈ ప్రాజెక్ట్తో ఎంతో మేలు జరగనుంది. పేదరిక నిర్మూలన, కమ్యూనిటీ భవనాలు వంటి కార్యక్రమాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా చేపడ్తారు. 1 బిలియన్ దిర్హామ్లు ప్రతి యేటా ఖర్చవుతాయని అంచనా. 


--సి.శ్రీ(దుబాయ్) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com