ఒమాన్ వాతావరణం: తుపాను సంకేతాలు

- October 04, 2015 , by Maagulf
ఒమాన్  వాతావరణం: తుపాను సంకేతాలు

అరేబియా సముద్రంలో తుపాను ఏర్పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అయితే ఇప్పుడే తుపానుపై ఎలాంటి నిర్ధారణకు రాలేమనీ, తుపాను ఏర్పడటానికి తగిన పరిస్థితులు అరేబియా సముద్రంలో ఉన్నాయని మాత్రమే చెప్పగలమని వాతావరణ శాఖ వెల్లడించింది. బీబీసీ వాతావరణ సూచనల ప్రకారం యూరోపియన్ సెంటర్ ఫర్ మీడియమ్ రేంజ్ వెదర్ ఫోర్కాస్ట్ మరియు అక్యువెదర్, అల్పపీడనంపై అంచనా వేసినట్లు అర్థమవుతుంది. రానున్న రోజుల్లో అల్ప పీడనం క్రమేనా బలపడి తుపానుగా పరివర్తనం చెందవచ్చు. ఒకవేళ తుపాను సంభవించినా అది ఒమన్ వైపు వస్తుందా? ఇంకో వైపు వెళుతుందా? అని కూడా ఇప్పుడే నిర్ధారించలేమనీ, రోజులు గడిచేకొద్దీ తుపానుపై స్పస్టత రావచ్చని అధికారులు వెల్లడించారు. మస్కట్లో సాధారణ వర్షపాతం 100 మిల్లీమీటర్లు. డిసెంబర్ నుంచి ఏప్రిల్ మధ్యలోనే సాధారణంగా వర్షాలుంటాయి. అకాల వర్షాలు, తుపాన్లు సంభవిస్తేనే ఇతర రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉంటుంది.


--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com