దుబాయ్ లో 'స్టార్ ట్రెక్ బియాండ్' సినిమా మేకింగ్
- October 04, 2015
దుబాయ్, అరబ్ ఎమిరేట్స్లో 'స్టార్ ట్రెక్ బియాండ్' సినిమా షూటింగ్కి అనువైన ప్రాంతాల్ని పరిశీలించింది చిత్ర యూనిట్. 'స్టార్ట్రెక్' సిరీస్లో మూడోదయిన 'స్టార్ ట్రెక్ బియాండ్' సినిమా కోసం అధునాతనమైన భవంతులు గల ప్రాంతం కావాల్సి రావడంతో, యునెటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా కొన్ని ప్రాంతాల్లో సినిమా షూటింగ్ జరిపారు. చిత్ర ఎగ్జిక్యూటివ్ నిర్మాతల్లో ఒకరైన జెఫ్రీ చెర్నోవ్ మాట్లాడుతూ, అద్భుతమైన లొకేషన్లు లభించాయనీ, ఇకపై హాలీవుడ్ సినిమాలు దుబాయ్ లో షూటింగ్ ఎక్కువగా జరుపుకుంటారని నమ్ముతున్నట్లు చెప్పాడు. గత శుక్రవారం దుబాయ్లోని షేక్ జాయెద్ రోడ్ని అధికారులు ఓ సినిమా షూటింగ్ కోసం మూసివేశారు. అద్భుతమైన అందాలు దుబాయ్ సొంతమనీ, దుబాయ్ లో షూటింగ్ చేసుకోవడం ఆనందంగా ఉందని షూటింగ్లో పాల్గొన్న జేమ్స్ టి క్రికిక్ చెప్పాడు. జస్టిన్ లిన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'స్టార్ ట్రెక్ బియాండ్' వచ్చే జులైలో విడుదల కానుంది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?







