ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణా పరిస్థితి మెరుగు
- October 04, 2015
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏ కేటగిరి ఆర్థిక శక్తిగా ఇండియా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ (ఇక్రా) గుర్తించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గతంలో ఇదే సంస్థ ఏ మైనస్ కేటగిరిలో చేర్చగా, ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత తెలంగాణా రేటింగ్ మైనస్ నుంచి ప్లస్‌లోకి వచ్చింది. అంతర్జాతీయ సంస్థల నుంచి రుణం పొందే సందర్భంలో తిరిగి రుణాలను చెల్లించే స్థోమత కలిగిన ఆర్థిక సంస్థల సామర్థ్యాన్ని లెక్క గట్టి ఇక్రా ఈ వివరాలను వెల్లడిస్తుంది. ఈ ఏడాది ఇక్రా వెల్లడించిన రేటింగ్ జాబితాలో తెలంగాణను ఏ కేటగిరి ఆర్థిక వ్యవస్థగా పేర్కొంది. దేశంలోని చాలా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు ఆధ్యయనం చేసిన ఇక్రా, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ పరిస్థితి మెరుగ్గా ఉందని తన నివేదికలో పేర్కొంది. అలాగే ఇక్రా తన అధ్యయనంలో తేలిన ఆరు సానుకూల అంశాలను నివేదికలో ప్రస్తావించింది. వీటిలో పన్నుల ద్వారా సమకూరే ఆదాయం తెలంగాణలో మెరుగ్గా ఉంది. దేశ తలసరి ఆదాయం 74వేల 380 రూపాయలు కాగా, తెలంగాణ తలసరి ఆదాయం 95వేల 361 రూపాయలు. తెలంగాణ రాష్ట్రం ఇటీవల తెచ్చిన నూతన పారిశ్రామిక విధానంవల్ల పెట్టుబడులను విపరీతంగా ఆకర్షించి ఆర్థికంగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకు పోనుందని ఇక్రా పేర్కొంది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పెట్టుబడి వ్యయంలో రుణం వాటా చాలా తక్కువగా ఉంది. రాష్ట్రంలో వివిధ కార్యక్రమాల కోసం ఖర్చు పెడుతున్న పెట్టుబడి సార్థకత పెట్టుబడులుగా ఉన్నాయి. ఆస్తుల సృష్టికి పెట్టుబడులు దోహదం చేస్తాయని నివేదికలో పేర్కొన్నారు. నీటిపారుదల ప్రాజెక్టులకు నిధులు ఖర్చు చేయడం వల్ల రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితి మెరుగవుతుందని ఇక్రా అభిప్రాయపడింది. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని ఇక్రా తెలంగాణ రాష్ట్రాన్ని ఏ కేటగిరిలో చేర్చింది. రేటింగ్ రావడం వల్ల తెలంగాణకు దేశ విదేశాల్లో పరపతి పెరుగుతుంది. రుణాల లభ్యత సులభం అవుతుంది. రేటింగ్ తక్కువ వచ్చినట్లయితే వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. మెరుగైన రేటింగ్ రావడం వల్ల రుణాలపై చెల్లించే వడ్డీరేటు తక్కువ అవుతుంది. పెట్టుబడిదారులు పెట్టుబడులు పెట్టేందుకు ఇక్రా ఇచ్చే రేటింగ్‌ను పరిగణలోకి తీసుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయం పేర్కొంది.
తాజా వార్తలు
- ఎన్ విడియా ఉపాధ్యక్షురాలితో సీఎం చంద్రబాబు భేటీ
- ఏప్రిల్ నుంచి యూపీఐ ద్వారా పీఎఫ్ విత్‌డ్రా
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పై దాడి ఘటనను ఖండించిన కేటీఆర్
- ఖతార్‌లోని ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత, రాయితీ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- జెబెల్ షమ్స్లో జీరో కంటే తక్కువకు టెంపరేచర్స్..!!
- బహ్రెయిన్ జస్రాలో అతిపెద్ద విద్యుత్ స్టేషన్ ప్రారంభం..!!
- సౌదీ రియల్ ఎస్టేట్ ధరల సూచీ..క్యూ4లో తగ్గుదల..!!
- కువైట్ లో నాలుగు ప్రైవేట్ ఫార్మసీల లైసెన్స్‌లు రద్దు..!!
- ఫిబ్రవరిలో అహ్మదాబాద్-షార్జా మధ్య స్పైస్‌జెట్ సర్వీసులు..!!
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి







