త్వరలో మెగా హీరో వరుణ్ తేజ్ కొత్త సినిమా

- October 05, 2015 , by Maagulf
త్వరలో మెగా హీరో వరుణ్ తేజ్ కొత్త సినిమా

డాషింగ్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్రానికి టైటిల్ మారింది. 'అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి' సినిమా తరహాలో మదర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన చిత్రం కావడంతో 'మా అమ్మ మహాలక్ష్మి' అనే సాఫ్ట్ టైటిల్‌ను ఖరారు చేశారట దర్శకనిర్మాతలు. మాస్ టైటిల్స్ పెట్టడంలో దిట్ట అయిన పూరి ఈ చిత్రానికి తనదైన శైలిలో 'లోఫర్' అనే టైటిల్ పెట్టినప్పటికీ నిర్మాత సి.కళ్యాణ్‌, రామ్ గోపాల్ వర్మ సలహా మేరకు ఈ చిత్రానికి 'మా అమ్మ మహాలక్ష్మి' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా చివరి దశకు చేరుకుంది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్‌కు తల్లిగా రేవతి నటిస్తుండగా.. తండ్రిపాత్రను పోసాని కృష్ణమురళి పోషిస్తున్నాడు. వరుణ్ తేజ్ సరసన దిశాపతాని కథానాయికగా నటిస్తోంది. సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మూడు నెలల్లో చిత్రాల్నీ పూర్తి చేసే దర్శకుడు పూరి ఈ చిత్రాన్ని కూడా 90 రోజులు లోపే పూర్తి చేస్తున్నాడు. త్వరలోనే ఈ చిత్రం విడుదల తేదీని ప్రకటిస్తారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com