రాజధాని శంకుస్థాపనకు సిద్ధం

- October 05, 2015 , by Maagulf
రాజధాని శంకుస్థాపనకు సిద్ధం

ఈనెల 22న జరిగే రాజధాని అమరావతి శంకుస్థాపనకు అధికారులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేపట్టారు. మొత్తం 16 హెలికాప్టర్లు, 9 హెలిప్యాడ్లను సిద్ధం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే నేతలు గన్నవరం నుంచి హెలికాప్టర్‌లో శంకుస్థాపన ప్రాంతానికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. 250 ఎకరాలను రాజధాని శంకుస్థాపనకు సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శంకుస్థాపన కోసం అధికారులు ఉద్దండరాయునిపాలెంలో భూమిని ఖరారు చేశారు. 50 ఎకరాల్లో బహిరంగ సభను ఏర్పాటు చేసి లక్షమంది కోసం చూసేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఈ సభలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, సింగపూర్‌, జపాన్‌ మంత్రులు ప్రసంగించనున్నారు. అలాగే గుంటూరు, విజయవాడ నుంచి రహదారుల వెడల్పు చేసి ఉద్దండరాయునిపాలెంకు రహదారులను అనుసంధానం చేయనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com