ఒమనైజేషన్తో నిర్మాణ రంగం కుదేలు
- October 05, 2015
నిర్మాణ రంగంలో 30 శాతం రిజర్వేషన్ స్థానికులకు కల్పించాలంటూ తీసుకున్న నిర్ణయంపట్ల నిర్మాణ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 30 శాతం ఒమనియన్లకే అవకాశాలు ఇవ్వాలన్న నిబంధన సరికాదనీ, ఈ నిబంధన ద్వారా తగినంతమంది స్థానిక కార్మికులు అందుబాటులో ఉండరని నిర్మాణ రంగంలోని ప్రముఖులు వెల్లడించారు. తాజా నిబంధనతో విదేశాల నుంచి కార్మికుల్ని తెచ్చుకోవడం కష్టమవుతుందనీ, స్వదేశంలోని కార్మికులు 6 నెలల కంటే ఎక్కువ కాలం తమతో కలిసి పనిచేయలేరని తద్వారా నిర్మాణ రంగం రానున్న రోజుల్లో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోనుందని ఓ కాంట్రాక్టర్ వెల్లడించారు. ప్రస్తుత నిబంధన ఒక దేశం నుంచి ఎక్కువమంది కార్మికుల్ని తీసుకురావడానికి అనుమతించదనీ, ప్రస్తుతం కేవలం 10 శాతం మంది మాత్రమే బంగ్లాదేశ్ నుంచి తీసుకోవడానికి అవకాశముందనీ, ఈ నిబంధనతో కార్మికుల కోసం ఇబ్బందులు తప్పవని యునైటెడ్ డ్రీమ్స్ ఎల్ఎల్సి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ మహమమద్ కబీర్ అహ్మద్ చెప్పారు. పాలకులు వీలైనంత త్వరగా ఈ నిబంధన సడలించకపోతే నిర్మాణ రంగం సంక్షోభంలో పడక తప్పదని కొందరు కాంట్రాక్టర్లు అంటున్నారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- ఆలయాల్లో రోజుకు 2 పూటలా అన్నప్రసాదం
- గుంటూరు వేదికగా ‘స్పేస్ టెక్ సమ్మిట్–2026’
- భారతీయ ఫిల్మ్‌మేకర్ ప్రారంభించిన 'ది స్టోరీటెల్లర్ యూనివర్స్' ఫిల్మ్ ఫెస్టివల్ విజయవంతం
- గ్రీన్ ల్యాండ్ లో అమెరికా యుద్ధ విమానాలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!







