ఎమిరేట్స్ ఐడీతో ఆన్లైన్లో వీసా పొందొచ్చు
- October 05, 2015
అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్మార్ట్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్‌లో భాగంగా రూపొందించిన యాప్ ద్వారా ఆన్లైన్లో వీసా పొందే అవకాశం ఉందని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ అల్ షమ్మరి చెప్పారు. వినియోగదారులు స్మార్ట్ గవర్నెన్స్ ఫలాల్ని పొందాలని సూచిస్తూ, పాలన ఇంకా సమర్థవంతంగా, ఎలాంటి ఇబ్బందులే లేకుండా ఉండేందుకు ఇ-గవర్నెన్స్‌ని అందుబాటులోకి తెచ్చామన్నారు అల్ షమ్మరి. ఇ-గవర్నెన్స్ పట్ల అవగాహన పెంచడానికి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, 2018 నాటికి 80 శాతం మంది ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళకుండానే తమకు కావాల్సిన పనుల్ని ఇ-గవర్నెన్స్ ద్వారా చేసుకోవచ్చన్నారు. స్మార్ట్ ఫోన్ ద్వారా అన్ని పనులూ చేసుకునేలా ప్రజలూ టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు అల్ షమ్మరి.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- DIMDEX 2026 ను ప్రారంభించిన అమీర్..!!
- పవిత్ర రమదాన్ మాసం ఫిబ్రవరి 19న ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో లగ్జరీ వాచీల స్కామ్..ఇద్దరికి జైలుశిక్ష, ఫైన్..!!
- కొత్త అల్-జౌఫ్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం..!!
- కువైట్‌లో ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సన్నాహక సమావేశం..!!
- భారత్, యూఏఈ మధ్య కుదిరిన కీలక ఒప్పందాలు..!!
- యూఏఈ అధ్యక్షుడికి అదిరిపోయే గిఫ్టులు ఇచ్చిన భారత ప్రధాని..!!
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి







