కె ఎస్ రవికుమార్ దర్శకత్వం లో బాలకృష్ణ నెక్ట్స్ సినిమా ఫిక్స్
- May 10, 2017
సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ, రాజకీయాల్లో బిజీగా ఉన్నా సినీరంగంలోనూ దూసుకుపోతున్నాడు. ఇటీవల గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాతో వంద సినిమాల మైలురాయిని అందుకున్న బాలయ్య, ప్రస్తుతం తన 101వ సినిమాలో నటిస్తున్నాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 101వ సినిమాలో మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించనున్నాడు.
ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టాడు బాలకృష్ణ. చాలా రోజులుగా చర్చలు జరుగుతున్న కె ఎస్ రవికుమార్ చిత్రాన్ని 102వ సినిమాగా ఫైనల్ చేశాడు. రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసే రవికుమార్ గతంలో చిరంజీవి, రాజశేఖర్ లతో తెలుగు సినిమాలను కూడా తెరకెక్కించాడు. చాలా కాలం తరువాత బాలకృష్ణ హీరోగా ఓ కమర్షియల్ సినిమాను రూపొందించనున్నాడు.
ఎం రత్నం కథ, మాటలు అందిస్తున్న ఈ సినిమాను సికె ఎంటర్టై న్మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్నాడు. పూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే కెఎస్ రవికుమార్ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు.
తాజా వార్తలు
- విక్రమ్ 1 దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్..జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్
- కువైట్ ఎయిర్వేస్ 13 గమ్యస్థానాలకు 35 విమాన సర్వీసులు పునఃప్రారంభం
- IPL 2026: రాజస్తాన్ పై హైదరాబాద్ ఘన విజయం
- ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్: మెట్రో నగరాలకే కాదు..విజయవాడకు పాకిన ఏఐ విప్లవం
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?









