మరో నటవారసున్నిపరిచయం చేస్తున్నా పూరి
- October 06, 2015
చిరుత సినిమాతో మెగాస్టార్ చిరంజీవి నటవారసున్ని పరిచయం చేసిన పూరి జగన్నాథ్ తాజాగా మరో నటవారసున్ని వెండితెరకు పరిచయం చేయబోతున్నాడు. చిరు 150వ సినిమాకు పూరి దర్శకత్వం అన్న వార్తలు, ఊహాగానాలకు తెరపడిన నేపథ్యంలో తన జెట్ స్పీడ్ వేగాన్ని తిరిగి కొనసాగించే పనిలో పూరి పడ్డాడు. ప్రస్తుతం వరుణ్‌తేజ్ హీరోగా లోఫర్ సినిమాను తెరకెక్కిస్తున్న పూరీ, ఆ సినిమా పూర్తికాకముందే తన తదుపరి సినిమాను ట్విట్టర్ ద్వారా ప్రకటించేశాడు. సినిమాకు 'రోగ్' అనే పేరును పెట్టాడు. పోకిరి సీక్వెల్‌గా ఈసినిమా తెరకెక్కనున్నట్లు సమాచారం. రోగ్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఇషాన్ అనే కొత్త కుర్రాడిని హీరోగా పరిచయం చేస్తున్నాడు. తెలుగులో మహాత్మలాంటి సక్సెస్‌పుల్ చిత్రాన్ని నిర్మించిన కన్నడ నిర్మాత,నటుడు సీఆర్ మనోహర్ తనయుడే ఈ ఇషాన్. నవంబర్‌లో చిత్రీకరణను ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్‌లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







