దుబాయ్‌లో సందడి చేసిన ఉదయనిథి స్టాలిన్‌

- May 11, 2017 , by Maagulf
1
 
తమిళ హీరో ఉదయనిథి స్టాలిన్‌, దుబాయ్‌లో సందడి చేశారు. దుబాయ్‌లోని దుసిత్‌ తని, మీటింగ్‌ రూమ్‌ -1లో ఉదయనిథి స్టాలిన్‌ తాసా చిత్రం 'శరవణన్‌ ఇరుక్క బయమేన్‌' ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయనిథి స్టాలిన్‌తోపాటు కమెడియన్‌ సూరి కూడా పాల్గొన్నారు.ఉదయనిధి స్టాలిన్ ని వేదిక మీద నటరాజ్ పుష్పగుచ్ఛము అందజేశారు.పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి ఉదయనిథి స్టాలిన్‌ అభిమానులు హాజరయ్యారు. ఎఫ్‌టిపి, రెడ్‌ కార్పెట్‌, యెస్‌ ఈవెంట్స్‌ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. తన కొత్త సినిమా అందరి అంచనాల్ని అందుకునేలా ఉంటుందని స్టాలిన్‌ ఈ సందర్భంగా చెప్పారు. దుబాయ్‌లో పర్యటించడం ఆనందంగా ఉందని, అభిమానుల్ని ఇలా కలుసుకోవడం ఎప్పటికీ మర్చిపోలేనని దుబాయ్‌ పర్యటనపై ఉదయ నిధి స్టాలిన్‌ వ్యాఖ్యానించారు.786
 
 
2
 
3
 
4
 
 
 
 
 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com