సౌందర్య చిట్కా:నారింజతో నిగారింపు

- April 24, 2015 , by Maagulf
సౌందర్య చిట్కా:నారింజతో నిగారింపు

సౌందర్య పోషణ కోసం కెమికల్స్‌తో కూడిన క్రీమ్‌లు ఉపయోగించడం కన్నా, సహజసిద్ధంగా లభించేవాటి నుంచి క్రీమ్‌లను తయారుచేసుకోవడం మంచిది. వీటివల్ల ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ వుండవు. మంచి నిగారింపు కోసం మనం ఇష్టంగా తినే ‘నారింజ’ ఎలా ఉపయోగపడ్తుందో ఒక్కసారి చూద్దాం. నారింజలో కాల్షియం, ఫోలిక్‌ యాసిడ్‌ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఎముకలు గట్టిపడటంలోనూ, మెదడుని చురుగ్గా ఉంచడంలోనూ తోడ్పతాయి. అంతే కాకుండా నారింజ సౌందర్య పరిరక్షణకూ ఉపకరిస్తుంది. కొద్దిగా నారింజ రసం తీసుకుని, దానికి కొంచెం శనగపిండి కలిపి పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. అలా తయారైన పేస్ట్‌ని మొహానికి పూతలా వేసుకుని, ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేస్తే మొహం శుభ్రపడి, సున్నితంగా, సుకుమారంగా మారుతుంది. మంచి నిగారింపు కూడా అభిస్తుంది. అలాగే రెండు స్పూన్స్‌ చొప్పున నారింజ రసం, నిమ్మరసం తీసుకుని, అందులో ఓ స్పూన్‌ తెనె కలిపి, ముఖానికి రాసి, కాస్త ఆరిపోయాక కడిగేసుకోవాలి. ఈ ప్యాక్‌ మొటిమలు రాకుండా కాపాడుతుంది. ప్రకృతిలోనే ఇన్ని సహజసిద్ధమైన సౌందర్య పోషకాలున్నప్పుడు, కెమికల్స్‌తో తయారయ్యే ప్యాక్స్‌ జోలికి ఎందుకువ వెళ్ళడం.?

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com