అబూధాబీలో వివిధ అతిక్రమణలకు పాల్పడిన 25 మంది చేతి సామాజిక సేవ

- May 16, 2017 , by Maagulf
అబూధాబీలో వివిధ అతిక్రమణలకు పాల్పడిన 25 మంది చేతి సామాజిక సేవ

అబూధాబీ : వివిధ అతిక్రమణలకు పాల్పడిన పాతికమంది వ్యక్తుల చేత సామాజిక సేవా కార్యక్రమాలను న్యాయస్థానం చేయించింది. వారు రోడ్లు, కూడళ్లు, మసీదులు, గ్రంధాలయాలు, ఉద్యానవనాలు శుభ్రం చేయడానికివారిని వినియోగించుకున్నారు. మార్చిలో శిక్ష అమలు అనంతరం  కొన్ని సందర్భాలలో జరిమానా చెల్లించినప్పటికీ ,వారి డ్రైవింగ్ లైసెన్సులను స్వాధీనం చేసుకొని, రోడ్లు, పబ్లిక్ కూడళ్లు , మసీదులు, ప్రజా గ్రంథాలయాలు, ప్రజా ఉద్యానవనాలు మరియు పెట్రోల్ స్టేషన్లలో శుభ్రం చేసే పనికోసం ముద్దాయిలని ఉపయోగించుకోవాలని అధికారులకు  సూచించించినట్లు అబుదాబి జ్యుడీషియల్ డిపార్ట్మెంట్ తెలిపింది. నిర్లక్ష్య డ్రైవింగ్, నెంబర్ ప్లేట్ లేకుండా కారు డ్రైవింగ్, వారి వాహనాలతో రహదారి విన్యాసాలను ప్రదర్శించడం, రహదారులపై వాహనాలతో పోటీ పడటం మరియు ఒక ప్రమాదానికి కారణమైన తర్వాత కానీ వారి వాహనం ఆపడం లేదు.నిందితులకు అప్పగించిన సమాజ సేవ పనుల ద్వారా వారి ప్రవర్తనా మార్గాన్ని మార్చినప్పుడు కూడా ప్రజలకు కొంత లబ్ది చేకూర్చే లక్ష్యంతో ఈ బలవంతపు సమాజసేవ వారితో చేయిస్తున్నారు. చట్ట ప్రకారం, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు కమ్యూనిటీ సర్వీసు అమలును పర్యవేక్షించి, నేరస్థుల పనితీరుపై నివేదికలు పంపనున్నారు.అపరాధి సమాజ సేవను చక్కగా అమలు చేయడంలో ఒకవేళ  విఫలమైతే, న్యాయవాదులు కోర్టుకు అతనిని తిరిగి  సూచించగలరు మరియు అతను అప్పగించిన సమాజ సేవ యొక్క కాలానికి ముందు విధించబడిన  జైలుశిక్షను అనుభవించేలా చేయవచ్చు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com