యూఏఈ దిర్హామ్‌కి 44 ఏళ్ళు

- May 17, 2017 , by Maagulf
యూఏఈ దిర్హామ్‌కి 44 ఏళ్ళు

యైఏఈ దిర్హామ్‌ రూపకల్పన జరిగి 44 ఏళ్ళు పూర్తవుతోంది. అంతకు ముందు యూఏఈ, ఇండియన్‌ కరెన్సీ తోపాటుగా గల్ఫ్‌ రుపీ, ఖతారీ రియాల్‌, దుబాయ్‌ రియాల్‌, బహ్రెయినీ దినార్‌లను వినియోగించేది. 44 ఏళ్ళ క్రితం మే 19న యూఏఈ దిర్హామ్‌కి రూపకల్పన చేశారు. 1973లో దిర్హామ్‌ తొలిసారిగా బయటకు వచ్చింది. 1, 5, 10, 50, 100 డినామినేషన్లతో యూఏఈ దిర్హామ్‌ చెలామణీలో ఉంది. అరేబియన్‌ హార్స్‌ వాటర్‌ మార్క్‌తో మొదట యూఏఈ దిర్హామ్‌ని రూపొందించారు. ఆ తర్వాత యూఏఈ నేషనల్‌ బర్డ్‌ అయిన ఫాల్కన్‌తో దాన్ని రీప్లేస్‌ చేయడం జరిగింది. కొత్త కరెన్సీ కోసం ఏర్పాటు చేసిన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ కరెన్సీ బోర్డ్‌ కూడా ఇదే రోజుని సెలబ్రేట్‌ చేసుకోనుంది. మొట్టమొదటి డినామినేషన్లపై ల్యాండ్‌మార్క్‌ ప్రింటింగ్‌ ఉండేదని నుమిస్‌బింగ్‌ ఫౌండర్‌ రామ్‌కుమార్‌ చెప్పారు. ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌ నోట్‌ సొసైటీ - దుబాయ్‌ చాప్టర్‌ ప్రెసిడెంట్‌ కూడా అయిన రామ్‌కుమార్‌ మాట్లాడుతూ, 1 దిర్హామ్‌ నోటు మీద షార్జా పోలీస్‌ ఫోర్ట్‌ క్లాక్‌టవర్‌ని ముద్రించేవారని చెప్పారు. 5 దిర్హామ్‌ల నోటుపై ఫుజారియా ఓల్డ్‌ ఫోర్ట్‌ బొమ్మ ఉండేది. 10 దిర్హామ్‌ నోటు మీద ఉమ్‌ అల్‌ కువైన్‌ ఏరియల్‌ వ్యూ ఉంటే, 50 దిర్హామ్‌ నోటు మీద అజ్మన్‌ రూలర్‌ బొమ్మను ముద్రించారు. 100 నోటు మీద రస్‌ అల్‌ ఖైమాలోని అల్‌ రామ్స్‌ బొమ్మ ఉండేది. యూఏఈలో పలువురు నివాసితులు పాత నోట్లను భద్ర పరిచి, చరిత్రకు సాక్ష్యాలుగా ఉంచారు. 
 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com