రోజూ అరకప్పు ఉడికించిన బ్రోకోలీ తీసుకుంటే
- May 17, 2017
బ్రోకోలీని ఎక్కువగా తీసుకోవడం ద్వారా క్యాన్సర్‌ను దూరం చేసుకోవచ్చు. బ్రోకోలీని తీసుకుంటే ఊపిరితితిత్తులు, కడుపు, కోలన్ క్యాన్సర్లు దరిచేరవు. అరకప్పు ఉడికించిన బ్రోకోలీని రోజూ తీసుకుంటే క్యాన్సర్ కారకాలు నశించిపోతాయి. బ్రోకోలీ లభించకపోతే ప్రత్యామ్నాయంగా క్యాబేజీని వాడుకోవచ్చు. బ్రోకోలీలో లభించే అన్ని కాంపౌండ్లు క్యాబేజీలోనూ ఉన్నాయి. బ్రోకోలీలో ఉండే సల్ఫోరఫేన్ అనే సల్ఫర్ కాంపౌండ్ల వల్ల క్యాన్సర్ దూరమవుతుంది.
అలాగే చర్మ ఆరోగ్యానికి బ్రోకోలీ ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని విటమిన్ సి, విటమిన్ బి కాంప్లెక్స్, విటమిన్ ఎ, కె, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చర్మానికి సంరక్షణ ఇస్తుంది. బ్రోకోలీలోని బీటా కెరోటీన్ కంటి దృష్టిలోపాలను దూరం చేస్తుంది. ఇందులోని క్యాల్షియం ఎముకలకు బలాన్నిస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు బ్రోకోలీని తీసుకోవచ్చు. దంత సమస్యలకు చెక్ పెట్టాలంటే వారానికి రెండు సార్లు బ్రోకోలీని తీసుకోవడం మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్‌లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









