కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి అనిల్ మాదవ్ దవే మృతి
- May 18, 2017
కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి అనిల్ మాదవ్ దవే హఠాన్మరణం చెందారు. 1956, జులై 6న మధ్యప్రదేశ్‌లోని బాద్‌నగర్‌లో ఆయన జన్మించారు. 2009 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. గతేడాది జులైలో కేంద్ర కేబినెట్ విస్తరణలో భాగంగా.. దవేను పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. అనిల్ దవే మృతిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిన్న సాయంత్రం వరకు దవేతో తాను మాట్లాడనని, ఎన్నో ముఖ్యమైన విషయాలు చర్చించుకున్నామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఆయన ఇకలేరనే వార్త వ్యక్తిగతంగా తనను ఎంతగానో వేదనకు గురిచేస్తోందన్నారు. దవే మృతి పట్ల కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సురేశ్ ప్రభు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







