న్యూయార్క్ నగరంలోని టైమ్స్‌స్క్వేర్ వద్ద కారు బీభత్సం
- May 20, 2017
డ్రగ్స్ మత్తులో నేవీ మాజీ ఉద్యోగి అత్యంత రద్దీగా ఉండే న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద కారుతో బీభత్సం సృష్టించాడు. మనుషుల గుంపుపైకి దూసుకెళ్లడంతో ఓ యువతి మృతి చెందగా, 22మంది తీవ్రగాయాలపాలయ్యారు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. న్యూయార్క్ నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన టైమ్స్ స్క్వేర్ సమీపంలోని 42 స్ట్రీట్‌లో మద్యం, డ్రగ్స్ తీసుకున్న ఓ అమెరికా నేవీ మాజీ ఉద్యోగి రిచర్డ్ రోజస్ కారు వేగంగా నడిపాడు. సిగ్నల్ వద్ద యూటర్న్ తీసుకుని కొన్ని సెకన్లలోనే జనాలపై దూసుకెళ్లి భయానక వాతావరణం సృష్టించాడు.
కారు ఛేజ్ బ్యాంకు వద్దకు రాగానే రోడ్డుపై వెళుతున్న దాదాపు 10మందిపైకి దూసుకెళ్లింది. ఇలా ఒక్కసారిగా కాదు. ఏకంగా మూడుసార్లు జనాలపైకి కారుతో వేగంగా మనుషులపై ఎక్కించాడు. ఒక్కసారిగా చోటు చేసుకున్న ఈ పరిణామాణానిిక జనాలు బెంబేలెత్తిపోయి పరుగులు తీశారు.
కాగా, ఈ ప్రమాదంలో ఎలీసా ఇల్‌స్మాన్ అనే ఓ యువతి అక్కడికక్కడే మృతి చెందగా, మరో 22మంది తీవ్రగాయాలపాలయ్యారు. వెంటనే అప్రమత్తమైన భద్రతాదళాలు క్షతగాత్రులను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నాయి. కాగా, గాయపడిన వారిలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ఘటన స్థలం నుంచి పారియేందుకు పరుగెత్తిన నిందితుడు రిచర్డ్‌ను కొందరు వ్యక్తుల సాయంతో న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన న్యూయార్క్ మేయర్ బిల్ డే బ్లాసియో.. ఇది ఉగ్రవాదుల చర్య కాదని, ఓ వ్యక్తి మద్యం, డ్రగ్స్ మత్తులో చేసిన అరాచకమని అన్నారు. కాగా, ప్రస్తుతం సీసీటీవీ ఫుటేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు







