కెనడాలోని చిన్నారిని నీళ్లలోకి లాగేసిన సీల్

- May 22, 2017 , by Maagulf
కెనడాలోని చిన్నారిని నీళ్లలోకి లాగేసిన సీల్

సరస్సులు, సముద్రాల్లో జలచరాలు కనబడగానే వాటికి ఏదో ఒక ఆహారాన్ని విసరడం మనలో చాలామందికి అలవాటు.  కెనడాలోని వాంకోవర్‌లో కూడా కొందరు వ్యక్తులు ఇలాగే ఓ సీల్‌‌ను చూసి ఆహారాన్ని విసిరారు.  ఆహారాన్ని తినేసి ఎగిరి మళ్లీ వెంటనే వెనక్కి వెళ్లిపోయింది.  ఇంతలోనే మళ్లీ వచ్చిన ఆ సీల్ అక్కడే వున్న ఓ చిన్నారి డ్రెస్ పట్టుకుని నీటిలోకి లాక్కెళ్లింది.  ఇది చూసిన ఓ వ్యక్తి వెంటనే దూకి చిన్నారిని రక్షించి పైకి తీసుకువచ్చాడు.  ఈ ప్రమాదంలో చిన్నారికి గానీ ఆ వ్యక్తికి గానీ ఎలాంటి హానీ జరగలేదు.  ఊహించని ఈ పరిణామానికి చిన్నారి కుటుంబం షాక్‌కు గురైంది.  ఈ ఘటనంతా మైఖెల్ ఫుజివారా అనే వ్యక్తి వీడియో తీసి యూట్యూబ్‌లో పోస్టు చేయగా అవి వైరల్ అయ్యింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com