గల్ఫ్ లో అష్టకష్టాలు పడుతున్న ఆంధ్ర మహిళ

- May 23, 2017 , by Maagulf

సౌదీ:ఆంధ్రా మహిళ అక్రమరవాణా ఇండియా నుండి ఖతార్ అక్కడి నుండి సౌదీకి తరలించారు.పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కె.నవరసపురం గ్రామానికి చెందిన జవదాల మార్తమ్మ (39) ఇంటి పనిమనిషిగా పనిచేయడానికి నవంబర్ 2016 లో ఖతార్ వెల్లింది. అక్కడి నుండి సౌదీకి తరలించారు. సౌదీ యజమాని శారీరక, మానసిక హింసలకు గురిచేస్తూ, జీతం కూడా ఇవ్వడం లేదని ఆమె భర్త జవదాల చిట్టిబాబు తెలిపారు. అధిక పనిఒత్తిడి వలన ఆమె అనారోగ్యం పాలైనదని, ఆమెను రక్షించి ఇండియాకు వాపస్ తెప్పించాలని చిట్టిబాబు వేడుకుంటున్నాడు.

--యం.భీం రెడ్డి 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com