వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశమైన అమెరికా అధ్యక్ష్యడు

- May 25, 2017 , by Maagulf
వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశమైన అమెరికా అధ్యక్ష్యడు

 అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విదేశీ పర్యటన జరుపుతున్న డొనాల్డ్ ట్రంప్ బుధవారం వాటికన్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోప్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా శాంతిని పెంపొందించడానికి అమెరికా అధ్యక్షుడిగా తన పలుకుబడిని ఉపయోగించాలని ట్రంప్‌ను కోరారు. పోప్‌ను కలుసుకోవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు ట్రంప్ అన్నారు. పోప్ ప్రాన్సిస్‌కు శాంతికి చిహ్నమైన ఆలివ్ ట్రీ చెక్కిన ఒక పతకాన్ని ట్రంప్‌కు బహూకరించారు. ‘మీరు శాంతికి కారణమవుతారన్న ఉద్దేశంతో నేను మీకు దీన్ని ఇస్తున్నాను’ అని పోప్ ఈ సందర్భంగా స్పానిష్ భాషలో ట్రంప్‌తో అన్నారు. మీరన్న మాటలను గుర్తుంచుకుంటానని ట్రంప్ అన్నారు. నిజానికి పోప్ ఫ్రాన్సిస్ అనేక విషయాల్లో ట్రంప్ విధానాలతో తీవ్రంగా విభేదిస్తుంటారు. ముఖ్యంగా మెక్సికో సరిహద్దుల్లో గోడ నిర్మిస్తామన్న ట్రంప్ ప్రకటనపై ఫ్రాన్సిస్ తీవ్రంగా స్పందించడం తెలిసిందే. అలాగే పర్యావరణం, గర్భస్రావాలు లాంటి అనేక విషయాల్లో సైతం ఫ్రాన్సిస్, ట్రంప్ అభిప్రాయాలు పూర్తి భిన్నంగా ఉండడం అందరికీ తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com