ప్రేమలో ఫెయిలైన జయదేవి అనే సాప్ట్వేర్ ఇంజనీర్ ప్రాణాలు తీసుకుంది
- May 25, 2017
కడలూరు జిల్లా చిదంబరం జగన్నాథవీధికి చెందిన జయరాజ్ పెద్ద కుమార్తె జయదేవి (30) ఎంఎస్సీ చదివి చిదంబరంలో ఉన్న వ్యవసాయ కార్యాలయంలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తూ చిదంబరంలోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉండేవారు. ఈ సమయంలో ఆ ప్రాంతానికి చెందిన శిఖామణి కుమారుడు కరుణానిధి (34) సివిల్ ఇంజినీర్‌తో జయదేవికి పరిచయం ఏర్పడి ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో కరుణానిధి జయదేవిని వివాహం చేసుకుంటానని చెప్పి పలుమార్లు ఆమెపై లైంగికదాడి చేశాడు. కానీ వివాహం చేసుకోవడానికి తిరస్కరించాడు. దీంతో విరక్తి చెందిన జయదేవి చిదంబరం పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈలోపు ప్రేమికుడు మోసం చేయడాన్ని తట్టుకోలేక జయదేవి మంగళవారం ఉదయం ఇంట్లో విషం తాగింది. ఇది చూసిన చెల్లెల్లు, ఇరుగుపొరుగు వారు ఆమెను చిదంబరం రాజాముత్తయ్య ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ జయదేవి మృతి చెందింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు కరుణానిధిని మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు.
తాజా వార్తలు
- క్షతగాత్రులను పరామర్శించిన యుఏఈ అధ్యక్షుడు
- దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ఎటువంటి ప్రమాదాలు జరగలేదు: వదంతులను కొట్టిపారేసిన అధికారులు!
- అనుమతి లేకుండా ధరలు మారిస్తే.. QR1,000,000 ఫైన్..!!
- డ్రైవింగ్ చేసేటప్పుడు అత్యవసర హెచ్చరిక వస్తే?
- ఇరాన్ దురాక్రమణ..బహ్రెయిన్‌కు నాటో మద్దతు..!!
- గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు నేపథ్యంలో TGWWC–ఒమాన్ శాఖ అత్యవసర సమావేశం
- నేషనల్ వాటర్ కంట్రోల్ సెంట్రల్ ను సందర్శించిన పీఎం..!!
- ఆఫ్రికన్, మధ్య ఆసియా దేశాలతో ఒమన్ చర్చలు..!!
- రియాద్, జెడ్డా నుండి దుబాయ్ కు ఫ్లైట్స్ పునరుద్ధరణ..!!
- దుబాయ్ లో పబ్లిక్ సేఫ్టీపై కొత్త చట్టం..Dh2 మిలియన్ల ఫైన్..!!









