విశాఖ మహానాడులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు
- May 27, 2017
తెదేపా 36వ ఏడాదిలోకి అడుగుపెట్టిన యువ పార్టీ అని.. ఏదైనా చేయగల సత్తా తెదేపాకు ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విశాఖపట్నంలోని ఏయూ ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న మహానాడులో ఆయన ప్రసంగించారు. తొలుత సభికులు, మీడియాకు ఆయన అభివాదం చేశారు. ‘36ఏడాదిలో అడుగుపెట్టిన తెదేపా యుక్త వయస్సులో ఉంది. మహానాడులో పార్టీ కార్యకర్తలు ఇంత ఉత్సాహంగా ఉండటాన్ని ఎప్పడూ చూడలేదు. తెలుగు జాతి జరపుకొనే ఏకైక పండుగ మహానాడు. తెలుగు వారి జీవితాల్లో వెలుగుతెచ్చిన పార్టీ తెదేపా. హుద్‌హుద్ ముప్పు నుంచి బయటపడటానికి నగర వాసులు చేసిన కృషి ఫలితంగానే నేడు దేశంలోని సుందర నగరాల్లో విశాఖ మూడోదిగా నిలిచింది’ అని చంద్రబాబు తెలిపారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి పునర్ అంకితం కావాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలుగు వారు గర్వపడేలా పోలవరం నిర్మించుకుందామన్నారు.
తెదేపా అధికారంలో ఉన్నప్పుడు విద్యకు ప్రాధాన్యమిచ్చిందని అన్నారు. ఫలితంగా నేడు తెలుగురాష్ట్రాలు దేశంలో విద్యాపరంగా ముందంజలో ఉన్నాయన్నారు.
రాయలసీమ, తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులకు తెదేపా ప్రాధాన్యమిచ్చిందని అన్నారు. నేటి హైదరాబాద్‌కు వస్తున్న ఆదాయం నాడు తెదేపా వేసిన పునాది కారణంగానే లభిస్తోందని చంద్రబాబు గుర్తు చేశారు. జీవితంలో మనం చేసిన పనులే చిరస్థాయిగా నిలిచిపోతాయని చెప్పారు.
తాజా వార్తలు
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!
- 'సింగిల్ విండో' సేవల సమయాలను ప్రకటించిన MoCI..!!









