రద్రమదేవి చిత్రానికి స్పందించిన రాజమౌళి
- October 08, 2015
అనుష్క ప్రధాన పాత్రలో కాకతీయుల చరిత్రతో రూపొందించిన రుద్రమదేవి చిత్రానికి తెలంగాణా ప్రభుత్వం పన్ను మినహాయించిన విషయం తెలిసిందే. ఈ విషయంపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి స్పందించాడు. తెలంగాణా ప్రభుత్వం రుద్రమదేవి చిత్రానికి పన్ను మినహాయింపునివ్వడం సంతోషించాల్సిన పరిణామం. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి తెరకెక్కించిన రుద్రమదేవి చిత్రం తెలుగు జాతికి గర్వకారణం అంటూ ట్విట్టర్లో తెలిపాడు. తెలంగాణా ప్రభుత్వం మాదిరిగానే ఏపీ ప్రభుత్వం కూడా పన్ను మినహాయింపునించాలని కోరాడు. రద్రమదేవి చిత్రానికి పనిచేసిన ప్రతీ ఒక్కరికి ఆల్ ది బెస్ట్ అంటూ పేర్కొన్నాడు. దర్శకుడు గుణశేఖర్ గుణ టీమ్ వర్క్స్ పతాకంపై అత్యంత ప్రతిష్ఠాత్మకంగా 70కోట్ల వ్యయంతో రూపొందించాడు. ఇళయరాజ సంగీతాన్నందించాడు. రుద్రమదేవి చిత్రం రకరకాల కారణాల వల్ల వాయిదాల మీద వాయిదా పడుతూ, అన్ని అవాంతరాలను దాటి ప్రపంచ వ్యాప్తంగా వేల థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. రుద్రమ దేవిగా అనుష్క, చాళక్య వీర భద్రుడిగా రానా, గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ నటించిన ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తాజా వార్తలు
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!







