దసరాకానుకగా మహేశ్‌బాబు 'స్పైడర్‌'

- May 29, 2017 , by Maagulf
దసరాకానుకగా మహేశ్‌బాబు 'స్పైడర్‌'

 సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు, మురుగన్‌దాస్‌ కాంబినేషన్‌లో ‘స్పైడర్‌’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందట. ఈ విషయాన్ని మహేశ్‌బాబు ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.
అలాగే టీజర్‌ను.. మహేశ్‌ తండ్రి కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదల కాబోతోంది. హారిస్‌ జైరాజ్‌ సంగీతం అందిస్తున్నారు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. ఎన్‌వీఆర్‌ సినిమాస్‌ పతాకంపై ఎన్‌వీ ప్రసాద్‌, ఠాగూర్‌ మధు నిర్మిస్తున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com