అక్వినో అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ కాల్పులు

- June 01, 2017 , by Maagulf
అక్వినో అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో భారీ కాల్పులు

ఫిలిప్పీన్స్‌:ఫిలిప్పీన్స్‌ రాజధాని మనీలాలోని నినోయ్‌ అక్వినో అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని రిసార్ట్‌ వరల్డ్‌ మనీలాలో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో 25 మందికిపైగా తీవ్రగాయాలయ్యాయి. కాల్పుల సమయంలో తప్పించుకునే క్రమంలో రెండో ఫ్లోర్‌ నుంచి కొందరు దూకేశారు.

దుండగులు రీసార్ట్‌లోని పలువురిని బందీలుగా చేసుకున్నట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో భారీ పేలుడు కూడా సంభవించినట్టు సమాచారం. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దుండగులు మాస్క్‌ ధరించి ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com