ఇద్దర్ని చంపిన మాజీ టీచర్‌

- June 02, 2017 , by Maagulf
ఇద్దర్ని చంపిన మాజీ టీచర్‌

రియాద్‌: కింగ్‌డమ్‌ స్కూల్‌కి చెందిన ఇద్దరు ఉద్యోగుల్ని కాల్చి చంపిన టీచర్‌ ఆచూకీపై ఇంకా స్పష్టత లేదు. మెయిన్‌టెనెన్స్‌ సూపర్‌వైజర్‌ అబ్దుల్‌ అజీజ్‌ (సౌదీ), వైస్‌ ప్రిన్సిపల్‌ మాజ్‌ (పాలస్తీనీ అమెరికన్‌) ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అధికారికంగా ఎలాంటి రిపోర్ట్‌ ఇంతవరకు వెల్లడించలేదు. ఓ బంగ్లాదేశీ కార్మికుడు, కిల్లర్‌ని అడ్డుకునే ప్రయత్నం చేయగా, ఈ ఘటనలో ఆ వర్కర్‌కి గాయాలయ్యాయి. కిల్లర్‌ని మాజీ టీచర్‌గా స్కూల్‌ యాజమాన్యం వెల్లడించింది. అయితే ఈ ఘటన వెనుక టెర్రర్‌ కోణాన్ని చూడలేమని వారంటున్నారు. టీచర్‌ని ఇరాకీ నేషనల్‌గా గుర్తించారు.జెమ్స్‌ గ్లోబల్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ స్కూల్స్‌ నిర్వహణలో కో-ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్‌గా ఆ స్కూల్‌ రన్‌ అవుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com