జులైలో ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటన
- June 08, 2017
భారత ప్రధాని నరేంద్ర మోదీ జులై 4 నుంచి మూడు రోజుల పాటు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 25 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జరపనున్న ఈ పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. ఆ దేశంలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని కూడా మోదీయే కావడం విశేషం. తొలి రోజు సాయంత్రం ఆయన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో చర్చలు జరపనున్నారు. మరుసటి రోజున టెల్ అవివ్‌లో భారత సంతతి ప్రజల సమావేశంలో పాల్గొంటారు. ఇక్కడ దాదాపు 80 వేల మంది భారతీయ యూదులు ఉన్నారు. వీరిని ఇక్కడ నాలుగు సామాజిక వర్గాలుగా...బెనె ఇజ్రాయెల్, కొచ్చినీస్, బాగ్దాదీస్, బెనయ్ మెనాషే...గుర్తిస్తున్నారు.యూదులను వేధించని దేశం ప్రపంచంలో భారత్ ఒక్కటే కావడం విశేషం. మోదీకి ఘనంగా స్వాగతం పలకడానికి వీరంతా ఇప్పటికే వెబ్‌సైట్‌ను ప్రారంభించారు.
తాజా వార్తలు
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!









