సోమాలియాలోని సైనిక స్థావరంపై దాడి, 70 మంది మృతి
- June 08, 2017
సోమాలియాలోని సగం స్వయంప్రతిపత్తి కలిగిన పున్‌ట్లాండ్ సైనిక స్థావరంపై అల్-షబాబ్ తీవ్రవాద సంస్థ భారీ దాడికి తెగబడింది. ఈ దాడిలో దాదాపు 70 మంది మృతిచెందారని అధికారులు గురువారం తెలిపారు. దీన్ని ఈ ఏడాదిలోనే అతి దారుణమైన దాడిగా పేర్కొన్నారు. బొస్సాసోలోని వాణిజ్యహబ్ నుంచి పడమర దిక్కున వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న అఫ్ ఉరుర్ శిబిరంపై తొలుత రిమోట్‌తో పేలుళ్లకు పాల్పడ్డారు. అంతకుముందే తీవ్రవాదులు సైనిక స్థావరంపై దాడిచేసి అత్యంత సమీపం నుంచి సైనికుల మీద కాల్పులు జరిపి చంపేసినట్టు సీనియర్ సైనికాధికారి అహ్మద్ మహ్మద్ తెలిపారు. ఇప్పటివరకు 70 మంది మృతిచెందినట్టు తెలిసిందని, మృతుల మొత్తం సంఖ్యపై కచ్చితమైన సమాచారం లేదని చెప్పారు. ఓ మహిళ సహా పలువురు పౌరుల తలలను తీవ్రవాదులు నరికేశారని ప్రత్యక్షసాక్షి అబ్దిబాసిత్ హస్సన్ తెలిపారు. తీవ్రవాదులతోపాటు మానవబాంబుల రూపంలో మూడుదిక్కుల నుంచి సైనిక స్థావరంపై దాడులు చేశారు.
-పౌరుల తల నరికేశారు.. సోమాలియాలో దారుణం
-దాడి తమ పనేనని ప్రకటించిన అల్-షబాబ్
అక్కడున్న సైనికులతోపాటు అప్పటికే అక్కడకు చేరుకున్న అదనపు బలగాలు ఎదురుదాడులకు దిగడంతో తీవ్రవాదులు శిబిరం నుంచి బయటకు వెళ్లిపోయారని సీనియర్ సైనికాధికారి కల్నల్ హషి అహ్మద్ తెలిపారు. ఈ దాడిలో దాదాపు వందమంది తీవ్రవాదులు పాల్గొని ఉంటారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. దాడికి పాల్పడింది తామేనని, ఇందులో 61 మంది సైనికులు మృతిచెందారని షహాదా అనే వార్తా సంస్థ ద్వారా అల్-షబాబ్ ప్రకటించినట్టు సైట్ అనే ఇంటెలిజెన్స్ సంస్థ తెలిపింది. అదేవిధంగా పెద్దఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి, సైనిక వాహనాలను సైతం స్వాధీనం చేసుకున్నట్టు అల్‌షాబాబ్ వెల్లడించింది.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









