పారామెడిక్స్‌ టీమ్‌ని సత్కరించిన సివిల్‌ డిఫెన్స్‌

- June 11, 2017 , by Maagulf
పారామెడిక్స్‌ టీమ్‌ని సత్కరించిన సివిల్‌ డిఫెన్స్‌

దుబాయ్‌ సివిల్‌ డిఫెన్స్‌, పారామెడిక్‌ టీమ్‌ని సత్కరించింది. అగ్ని ప్రమాదం కారణంగా కాలిపోతున్న ఓ భవనం నుంచి ముగ్గురు వ్యక్తుల్ని రక్షించే క్రమంలో వీరు ప్రదర్శించిన సాహసానికి గుర్తింపుగా ఈ సత్కారం జరిగింది. అల్‌ మనార్‌ ప్రాంతంలో గత నెలలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటలో దుబాయ్‌ కార్పొరేషన్‌ ఫర్‌ అంబులెన్స్‌ సర్వీసెస్‌ (డిఎసిఎస్‌)కి చెందిన పారామెడిక్స్‌ టీమ్‌, ఓ చిన్నారి, ఓ మహిళ సహా ముగ్గుర్ని ప్రాణాపాయం నుంచి రక్షించింది. దుబాయ్‌ సివిల్‌ డిఫెన్స్‌ డైరెక్టర్‌ జనరల్‌ మేజర్‌ జనరల్‌ రషీద్‌ థని అల్‌ మత్రోషి ఈ సందర్భంగా పారామెడిక్స్‌ టీమ్‌ని ప్రశంసలతో ముంచెత్తారు. డ్రైవర్‌ జలాల్‌ అబాదీ, అగ్ని ప్రమాదం జరిగిన భవనంలోకి దూసుకెళ్ళి చిన్నారని తీసుకొచ్చారు. పారామెడిక్‌ నాజర్‌ అల్‌ మజ్రోకి, ఓ వృద్ధురాల్ని బయటకు తీసుకొచ్చారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com