రామ్‌గోపాల్ వర్మ తో బాలయ్య సినిమా కచ్చితంగా ఉంటుంది: పూరీ జగన్నాధ్
- June 11, 2017
ఇటీవలి కాలంలో ఊహించని కాంబినేషన్లలో నందమూరి నటసింహం బాలకృష్ణ సినిమాలు చేస్తున్నారు. క్రిష్ డైరెక్షన్లో వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి, పూరీ జగన్నాథ్‌తో పైసా వసూల్ సినిమాలు అలా వస్తున్నవే. ఆ రెండు కాంబినేషన్లను కూడా ఎవరూ ఊహించి ఉండరు. తాజాగా మరో అప్‌డేట్ వినిపిస్తోంది. సంచలనాలకు కేంద్ర బిందువైన రామ్‌గోపాల్ వర్మతో బాలయ్య ట్రెండ్ సెట్ చేస్తారా..? అంటే అవుననే అంటున్నారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్. బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా అభిమానులతో చేసిన ఫేస్‌బుక్ లైవ్ చాట్‌లో పూరీ ఈ విషయాన్ని చెప్పారు. ''ప్రస్తుతం మీతో పనిచేస్తున్న బాలయ్య.. మీ గురువు రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో సినిమా చేస్తారా..?'' అని పూరీ జగన్నాథ్‌ను ఓ అభిమాని ప్రశ్నించగా.. దానికేం భాగ్యం చేస్తారు అని సమాధానమిచ్చారు. ''ఎందుకు చేయరు..? ఆర్జీవీ డైరెక్షన్‌లో బాలయ్య సినిమా కచ్చితంగా ఉంటుంది'' అని బదులిచ్చారు పూరీ. అయితే.. అభిమాని అడిగినందుకు పూరీ అలా చెప్పారా..? లేదంటే ఆర్జీవీతో బాలయ్య సినిమా కోసం ఏవైనా ప్రయత్నాలను పూరీ చేస్తున్నారా..? అనే చర్చ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో నడుస్తోంది. అయితే.. కొత్త కాంబినేషన్లను సెట్ చేస్తున్న బాలయ్య.. కచ్చితంగా వర్మతో సినిమా చేసేస్తాడేమోనన్న అభిప్రాయమూ ఫిల్మ్‌నగర్ వర్గాల నుంచి వస్తోంది. దానికి ఓ సంఘటననూ ఉదహరిస్తున్నారు. కృష్ణవంశీ దర్శకత్వంలో చేయాలనుకున్న రైతు సినిమాలో అతిథి పాత్ర కోసం అమితాబ్ బచ్చన్‌ను కలిసేందుకు వెళ్లిన సందర్భంలో.. వర్మ-బాలయ్య చాలా సన్నిహితంగా మెలిగిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏమో.. నిజంగానే వర్మతో బాలయ్య కొత్త కాంబినేషన్‌ను సెట్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
తాజా వార్తలు
- యూఏఈ–ఒమన్ హఫీత్ రైల్ ప్రాజెక్ట్ 40% పూర్తి..!!
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు









