గుంటూరు లో అవినీతి నిర్మూలనకు 1100 టోల్‌ఫ్రీ నెంబరు

- June 14, 2017 , by Maagulf
గుంటూరు లో అవినీతి నిర్మూలనకు 1100 టోల్‌ఫ్రీ నెంబరు

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అవినీతిని నిర్మూలించడానికి సీఎం చంద్రబాబు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. గుంటూరు జిల్లా పరిషత్‌ మీటింగ్‌ హాలులో బుధవారం మైనింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లు, అధికారులతో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు. కరప్షన్‌ కంట్రోల్‌ మేనేజ్‌మెంట్‌ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మైనింగ్‌ కాంట్రాకర్లు నిజాయితీగా వ్యవహరించి, గొల్లపాలెం తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. అవినీతి నిర్మూలన, లంచాలపై సమాచారానికి ఏర్పాటుచేసిన 1100 టోల్‌ఫ్రీ నంబరుకు వచ్చే ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతోనే పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఈ నెంబరుకు వచ్చే ఫిర్యాదులను పరిశీలించి దర్యాప్తు చేయడానికి 750 మందితో ప్రత్యేక వ్యవస్థ కొనసాగుతుందన్నారు. సమావేశంలో కలెక్టర్‌ శశిధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com