18 మందికి జీవిత ఖైదు, 8 మందికి 15 ఏళ్ళ జైలు
- June 16, 2017
హై క్రిమినల్ కోర్టు, 26 మంది వ్యక్తులకు తీవ్రవాద గ్రూపు ఏర్పాటు చేశారన్న నేరాభియోగాల నేపథ్యంలో జైలు శిక్ష విధించింది. 'షాబ్ అల్ దురాజ్' (దురాజ్ యూత్) పేరుతో తీవ్రవాద గ్రూపుని ప్రారంభించి, తీవ్రవాద దాడులకు పాల్పడిన నేరానికిగాను వీరికి ఈ జైలు శిక్ష విధింపబడింది. మొత్తం 26 మందిలో 18 మందికి జీవిత ఖైదు, 8 మందికి పదిహేనేళ్ళ జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. వీరందరికీ బహ్రెయిన్ పౌరసత్వాన్ని రద్దుచేస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. అయితే ఇందులో ఒకరు బహ్రెయినీ వ్యక్తి కాదు. జైలు శిక్ష పూర్తయ్యాక అతన్నీ దేశం నుంచి బహిష్కరిస్తారు. 2011 నుంచి 2013 వరకు వీరు తీవ్రవాద భావజాలంతో దాడులకు పాల్పడ్డారు. ఐదో నిందితుడి సహకారంతో ఇంప్రూవైజ్డ్ బాంబుల్ని తయారు చేసింది ఈ గ్రూపు. 2013, సెప్టెంబర్ 18న నిందితులు ఫైర్ బాంబులు, అలాగే ఇంప్రూవైజ్డ్ గన్స్‌తో పోలీసులపై దాడులకు దిగారు.
తాజా వార్తలు
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!
- కువైట్‌లో బుక్ డొనేషన్ డ్రైవ్..!!
- యూఏఈలో ఆత్మహత్యాయత్నం ఇక నేరం కాదు..!!
- ఒమన్‌లో వరుస చోరీలు.. ఏడుగురు నిందితులు అరెస్ట్..!!
- దుబాయ్‌లో షేరింగ్ వసతికి అనుమతించిన ప్రాంతాల పూర్తి జాబితా..
- ఖతార్‌లో డ్రైవింగ్ స్కూళ్లకు కొత్త నిబంధనలు..!!
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం







