18 మందికి జీవిత ఖైదు, 8 మందికి 15 ఏళ్ళ జైలు

- June 16, 2017 , by Maagulf
18 మందికి జీవిత ఖైదు, 8 మందికి 15 ఏళ్ళ జైలు

హై క్రిమినల్‌ కోర్టు, 26 మంది వ్యక్తులకు తీవ్రవాద గ్రూపు ఏర్పాటు చేశారన్న నేరాభియోగాల నేపథ్యంలో జైలు శిక్ష విధించింది. 'షాబ్‌ అల్‌ దురాజ్‌' (దురాజ్‌ యూత్‌) పేరుతో తీవ్రవాద గ్రూపుని ప్రారంభించి, తీవ్రవాద దాడులకు పాల్పడిన నేరానికిగాను వీరికి ఈ జైలు శిక్ష విధింపబడింది. మొత్తం 26 మందిలో 18 మందికి జీవిత ఖైదు, 8 మందికి పదిహేనేళ్ళ జైలు శిక్షను న్యాయస్థానం ఖరారు చేసింది. వీరందరికీ బహ్రెయిన్‌ పౌరసత్వాన్ని రద్దుచేస్తూ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. అయితే ఇందులో ఒకరు బహ్రెయినీ వ్యక్తి కాదు. జైలు శిక్ష పూర్తయ్యాక అతన్నీ దేశం నుంచి బహిష్కరిస్తారు. 2011 నుంచి 2013 వరకు వీరు తీవ్రవాద భావజాలంతో దాడులకు పాల్పడ్డారు. ఐదో నిందితుడి సహకారంతో ఇంప్రూవైజ్డ్‌ బాంబుల్ని తయారు చేసింది ఈ గ్రూపు. 2013, సెప్టెంబర్‌ 18న నిందితులు ఫైర్‌ బాంబులు, అలాగే ఇంప్రూవైజ్డ్‌ గన్స్‌తో పోలీసులపై దాడులకు దిగారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com