తండ్రి కాబోతున్న మైసూర్ మహారాజు..

- June 17, 2017 , by Maagulf
తండ్రి కాబోతున్న మైసూర్ మహారాజు..

పాపం.. శాపం.. హిందువుల నమ్మకం.. కొందరు మూఢనమ్మకం గా కొట్టివేసేవారున్నారు.. రావణుడు.. సీతను ఎత్తికెళ్లిన పాపం.. లంక నాశనం.. ద్రౌపతి వస్త్రాపహరణం.. కౌరవంశ వినాశనం.. అని చాలమంది ఫీలింగ్.. కానీ ఈ భావాలను నేటి తరం వారు ఎగతాళి చేస్తారు.. కానీ మైసూర్ రాజ కుటుంబీకులు... సువిశాల రాజ్యం.. అంగబలం.. అర్ధబలం కలిగి ఉన్న రాజవంశానికి లంకంత ప్యాలెస్.. కానీ ఆ రాజవంశానికి ఓ మహిళ పెట్టిన శాపం తో.. గత 400 ఏళ్లుగా సంతానం లేకుండా మనోవేదనకు గురైనవారే.. ఇప్పటి వరకు బంధువులలో యోగ్యుడైన ఒక పిల్లవాడిని ఎంపిక చేసుకుని దత్తత తీసుకుని రాజవంశ వారసుడిగా ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకం చేసి మైసూరు మహారాజుగా ప్రకటిస్తూ వచ్చారు. కాగా 400 సంవత్సరాల నిరీక్షణ అనంతరం మైసూరు మహారాజ వంశానికి శాప విముక్తి కలిగింది. వివరాల్లోకి వెళ్తే..
క్రీ.శ.1612లో శ్రీరంగాయన మైసూరు సింహాసనాన్ని ఏలుతున్న సమయంలో.. రాజు ఒడయార్‌ ఆయనపై తిరుగుబాటు చేసి తానే రాజయ్యాడు. ఒడయార్ నమ్మక ద్రోహానికి తీవ్రవేదనకు గురైన తిరుమలరాజ భార్య అలివేలమ్మ కొన్ని ఆభరణాలు తీసుకుని తలకాడుకు వెళ్లిపోయింది. కానీ శత్రుశేషం.. ఎప్పటికీ ప్రమాదం అని భావించిన ఒడయార్ సైనికులను తలకాడుకు పంపి.. అలివేలమ్మను చుట్టుముట్టి సంహరించే ప్రయత్నం చేయగా.. ఆమె తీవ్ర ఆగ్రహానికి గురై.. మైసూర్ రాజవంశం.. నిలవదని.. ఆ ఇంత సంతాన భాగ్యం ఉండదని శపించి.. కావేరీ నదిలోకి దూకించి అని చరిత్ర చెబుతోంది.. ఆమె శపమో... మరేదైనా కరనమో.. అప్పటి నుంచి ఇప్పటి వరకూ మైసూర్ వంశంలో సంతానం లేక మనోవేదనకు గురైనవారే.. దీంతో తప్పని సరి పరిస్థితిలో యోగ్యుడైన ఒక పిల్లవాడిని దత్తతీసుకొని రాజవంశ వారసుడిగా ప్రత్యేక పూజలు నిర్వహించి అబిషేషేకం చేసి.. మైసూర్ మహారాజుగా ప్రకటిస్తూ వస్తున్నారు.. కాగా మైసూరు యువరాజుగా పట్టాభిషిక్తుడైన యదువీరకృష్ణదత్త చామరాజ ఒడయార్‌కు గత ఏడాది జూన్‌ 27న జైపూర్‌ యువరాణి త్రిషికాసింగ్‌తో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.. కాగా 400 ఏళ్ల తర్వాత మైసూర్ రాజవంశానికి శాప విమోచనం కలుగుతుందని.. ఓ జ్యోతిష్యుడు ముందే చెప్పాడు.. కాగా రాజవంశానికి ఇప్పటికీ శాపవిముక్తి లభించబోతున్నది.. మైసూర్ మహారాజా యుదీవర త్వరలో తండ్రి కాబోతున్నాడు.. ఈ వార్తా తెలియగానే మైసూర్ కి ముందుగానే దసరా సంబరాలు తెచ్చింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com