2032 ఒలింపిక్స్కు బిడ్ దాఖలు చేయనున్న భారత్
- June 17, 2017- ఐఓఏ అధ్యక్షుడు రామచంద్రన్
2032 ఒలింపిక్స్‌కు భారత్ బిడ్ దాఖలు చేసే అవకాశముందని భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్. రామచం ద్రన్ వెల్లడించారు. ప్రభుత్వంతో ప్రాథమిక చర్చలు నడుస్తున్నాయని కొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే వీలుందని రామచంద్రన్ అన్నాడు. తమిళనాడు ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా రామచంద్రన్ మీడియాతో మాట్లాడాడు. ' 2032 ఒలింపిక్స్ బిడ్ దాఖలు చేసే అవకాశాలు పరిశీలించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఇది చాలా ప్రాథమిక దశ. ఇంకా ఎన్నో అనుమతులు పొందాల్సి ఉంది. ఐఓఏ పూర్తి ప్రణాళిక ప్రభుత్వానికి అందజేస్తే, వారు పరిశీలించాలి. అక్కడ్నుంచి హామీ లభిస్తే.. ఐఓఏ బిడ్ దాఖలు చేస్తుంది. ప్రభుత్వం సహా ప్రతిపక్ష నాయకుడి అంగీకారం సైతం కావాలి. ఒలింపిక్ నగరం ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి సహా ప్రతిపక్ష నాయకుడు కూడా అంగీకరించాలి.
దీనికి కనీసం 7-8 ఏండ్ల నుంచే సిద్ధం కావాలి. ఓవరాల్‌గా 12 మిలియన్ డాలర్ల వ్యయం కానుండగా.. దీన్ని ఎనిమిదేండ్లలో వ్యవధిలో ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. కాబట్టి ఆర్థికంగానూ పెద్ద ఇబ్బంది ఉండదు' అని రామచంద్రన్ తెలిపాడు.
తాజా వార్తలు
- ఏపీ: అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ విడుదల..
- టికెట్ చార్జీలు పెంచలేదు: విసి సజ్జనార్
- ఎనిమిది యూరోపియన్ దేశాలకు చైనా 'వీసా-ఫ్రీ ఎంట్రీ'
- రాష్ట్ర ప్రజలకు వైఎస్ విజయమ్మ మరో లేఖ
- కువైట్ హెల్త్ మినిస్ట్రీలో 12వేల మంది వైద్యులు..నివేదిక
- డిసెంబర్ వరకు స్వచ్ఛంద చమురు కోతలను పొడిగించిన ఒపెక్ దేశాలు..!!
- దుబాయ్ పాఠశాలల్లో మీజిల్స్ టీకాలు తప్పనిసరి..!!
- ఇంత మొత్తాన్ని ఊహించలేదు.. 20 మిలియన్ దిర్హాంలు గెలిచిన ప్రవాస భారతీయులు..!!
- ఒమన్లో నిధుల సేకరణ కోసం కొత్త నిబంధనలు..!!
- కార్లలో వరుస చోరీలు.. ముసుగు దొంగ అరెస్ట్..!!