ముగ్గురు హీరోయిన్లతో నటించనున్న యంగ్ హీరో...

- June 17, 2017 , by Maagulf
ముగ్గురు హీరోయిన్లతో నటించనున్న యంగ్ హీరో...

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వస్తున్న మూడో సినిమా టైటిల్ ప్రకటించింది ఈ మూవీ టీమ్. జయ జానకి నాయక అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రగ్యా జైస్వాల్, కేథరిన్ థెరెసా హీరోయిన్లు.
మిరియాల రవీందర్ నిర్మాణంలో బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తోందీ చిత్రం. టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం ఓ సాంగ్ షూట్ చేస్తున్నారు.  

అల్లుడు శ్రీను చిత్రంతో తెరంగేట్రం చేసిన శ్రీనివాస్ రెండో మూవీ నిరాశ పరచడంతో, ఈ మూడో మూవీని భారీ స్థాయిలో తీస్తున్నారు. బోయపాటి సన్నిహిత సాంకేతిక సిబ్బంది జయ జానకి నాయక చిత్రం కోసం పని చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com