'శంకరాభరణం' వేడుకకు తారక్

- June 19, 2017 , by Maagulf
'శంకరాభరణం' వేడుకకు తారక్

హైదరాబాద్: 'శంకరాభరణం' చిత్రంతో బాలనటిగా అలరించి చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న నటి తులసి. తనను చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇటీవల ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్న నేపథ్యంలో ఆయనకు గురుదక్షిణ ఇవ్వబోతున్నారు. విశ్వనాథ్ గౌరవార్థం రేపు హైదరాబాద్లో 'శంకరాభరణం' పేరుతో ప్రత్యేక పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ నటీనటులను ఒకే వేదికపైకి తెస్తూ 24 విభాగాల్లో ఈ పురస్కారాలను ప్రదానం చేస్తున్నట్టు తులసి వెల్లడించారు. మాదాపూర్లోని శిల్పకళావేదికలో రేపు జరిగే ఈ పురస్కారాల ప్రదానోత్సవానికి ఎన్టీఆర్ హాజరవుతారని ఆమె వెల్లడించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com