పార్కింగ్‌ ఏరియాలో మూత్ర విసర్జన: బోర్డుల ఏర్పాటు

- June 20, 2017 , by Maagulf
పార్కింగ్‌ ఏరియాలో మూత్ర విసర్జన: బోర్డుల ఏర్పాటు

మనామా: మునిసిపల్‌ అథారిటీస్‌, రెండు పెద్ద పార్కింగ్‌ గ్రౌండ్స్‌ని క్లీన్‌ చేసి, అక్కడ 'మూత్ర విసర్జన' చేయొద్దంటూ బోర్డులను ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్‌ ఎవెన్యూ, రోడ్‌ నెంబర్‌ 453, బ్లాక్‌ 304 ఓపెన్‌ టాయిలెట్లుగా మారిపోయాయి. దాంతో అధికార వర్గాలు క్లీనింగ్‌ చర్యలకు ఉపక్రమించాయి. క్లీనింగ్‌ కంపెనీ రెండు పార్కింగ్‌ గ్రౌండ్స్‌ని క్లీన్‌ చేశాయి. మనామా బస్‌ స్టేషన్‌ ఎదురుగా ఈ క్లీనింగ్‌ కార్యక్రమం చేపట్టి, బ్యానర్లతోపాటు పోస్టర్లను ఏర్పాటు చేశారు. పబ్లిక్‌ ప్లేస్‌లలో బహిరంగ మూత్ర విసర్జన చేయరాదని వాటిల్లో పేర్కొన్నారు అధికారులు. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయనీ, అవగాహనా కార్యక్రమాలు చేపడుతున్నామని క్యాపిటల్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ మజెన్‌ అహ్మద్‌ అల్‌ ఒమ్రాన్‌ చెప్పారు. బహిరంగ మూత్ర విసర్జన కారణంగా అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయని ఆయన హెచ్చరించారు. పౌరులెవరైనా ఇటువంటి విషయాలపై తగిన సూచనలు, సలహాలు ఇచ్చేందుకు హాట్‌లైన్‌ని వినియోగించాలని ఆయన కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com