రమదాన్ సందర్భంగా ఖతర్ రాజు క్షమాభిక్ష
- June 23, 2017
ఖతర్:పవిత్ర రమదాన్ మాసాన్ని పురస్కరించుకుని భారత్‌కు ఖతర్ తీపికబురు చెప్పింది. తమ దేశ జైల్లో మగ్గుతున్న 42 మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం క్షమాభిక్షను ప్రసాదించింది. ఈ మేరకు ఖతర్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ ఉత్తర్వులు జారీచేసినట్టు భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. అయితే భారతీయ ఖైదీల్లో ఎవరెవరు విడుదలయ్యారనేది తెలియరాలేదు. ఇటీవల సౌదీ సహా కొన్ని గల్ఫ్ దేశాలు ఖతర్‌పై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఖతర్‌తో అన్ని రకాల సంబంధాలను తెగదెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించి, విమాన రాకపోకలను కూడా నిలిపివేశాయి. దీంతో ఆ దేశంలోని భారతీయులు కొంత ఇబ్బంది పడ్డారు. అంతర్జాతియంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా రంజాన్ సందర్భంగా భారీ సంఖ్యలో భారతీయులకు క్షమాభిక్ష ప్రకటించడం విశేషం. వీరిలో చాలామంది యజమానుల అక్రమ కేసుల్లో బాధితులు కాగా, మరికొంతమంది నేర చరిత్ర కలిగిన వారని తెలుస్తోంది.
తాజా వార్తలు
- శంషాబాద్ విమానాశ్రయంలో రూ.14 కోట్ల విలువైన గంజాయి పట్టివేత
- ఓటమి పై యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం ఏమన్నారంటే?
- హైదరాబాద్ లో గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే రూట్ ఖరారు
- షేక్ జాయెద్ రోడ్డులో మోటార్ సైక్లిస్ట్ మృతి..!!
- ముబారకియా మార్కెట్ కోసం ఏసీ వాక్‌వేలు..!!
- అమీర్, యూఏఈ ప్రెసిడెంట్ భేటీ..!!
- ఇరాన్-IAEA ఒప్పందాన్ని స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- ఉద్యోగిని కొట్టిచంపిన వ్యక్తికి జీవితఖైదు..!!
- పిల్లలు, యువతపై వాతావరణ మార్పుల ప్రభావంపై అధ్యయనం..!!
- యూఏఈ పై భారత్ ఘన విజయం