వారాహి వారి రెండు రెళ్లు ఆరు మూవీ ఆడియో, టీజర్ రిలీజ్
- June 23, 2017
వారాహి చలన చిత్ర పతాకం నిర్మాత సాయి కొర్రపాటి తాజాగా నిర్మిస్తున్న చిత్రం రెండు రెళ్లు ఆరు.. అనిల్-మహిమ జంటగా నటిస్తున్న ఈ మూవీకి నందు మల్లెల దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రదీప్ చంద్ర.. మోహన్ నిర్మాతలు. సంగీతం విజయ్. అందరూ కొత్త వారితో రూపొందుతున్న ఈ మూవీ ఆడియో విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా దర్శకధీరుడు రాజమౌళి హాజరయ్యాడు. అలాగే కీరవాణి, సీనియర్ నటుడు నరేష్, ఈ మూవీ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ వేడుకలో పాల్గొన్నారు.. ఈ మూవీ ఆడియోను రాజమౌళి విడుదల చేశారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ''సాయిగారికి జనాల పల్స్ బాగా తెలుసు. 'ఈగ'ను చిన్న సినిమాగా తీద్దాం అనుకుంటే ఆయన వచ్చి దాన్ని పెద్ద సినిమా చేశారు. చిన్న సినిమా కథలో ఏదో ఒక ఆసక్తికర పాయింట్ లేకపోతే జనాలు చూడరు. 'రెండు రెళ్లు ఆరు' లో కూడా మంచి పాయింట్.. ఎంటర్టైన్మెంట్.. మనసుకు హత్తుకునే సన్నివేశాలు ఉన్నాయి" అని వెల్లడించారు..
ఈ మూవీ వారాహి చలన చిత్ర సంస్థకు మంచి పేరు తెస్తుందని అన్నారు.. తాజాగా విడుదలైన టీజర్ ను మీరూ చూడండి.
తాజా వార్తలు
- 'వాహన్' పోర్టల్లోకి తెలంగాణ..అన్నీ ఆన్లైన్లోనే!
- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ వేదిక సస్పెన్స్, టికెట్లు సేల్!
- తిరుపతి: భువన మృతి..హత్య లేక ఆత్మహత్య?
- యూఏఈలో నోటీసు పీరియడ్ లేకుండానే రిజైన్ చేయవచ్చా?
- కుటుంబ సభ్యుల 72 రోజుల నిరీక్షణ ముగిసింది
- తెలంగాణ: డీజీపీ ఎదుట లొంగిపోయిన నలుగురు అగ్రనేతలు
- ‘Sahl’ ద్వారా వెహికల్ డ్రైవింగ్ ఆథరైజేషన్ సర్వీస్..!!
- హమద్ టౌన్, జనబియా రోడ్లలో సేఫ్టీ పెంపు..!!
- కోఆర్డినేట్లను ఉపసంహరించుకోండి..ఇరాక్ కు జిసిసి చీఫ్ పిలుపు..!!
- దుబాయ్, షార్జాలో పలు ఫ్లైట్స్ డిలే.. క్యాన్సిల్..!!









