అవసరాల శ్రీనివాస్ పరిచయం చేసిన అరవింద్ కృష్ణ పాత్ర
- June 25, 2017
ప్రపంచ సినిమా స్థాయిలో ఇప్పుడిప్పుడే తెలుగు చిత్రసీమ ఎదుగుతోంది. నిర్మాణం పరంగా కొత్త పుంతలు తొక్కుతోంది. తెలుగు నేటివిటీతో ప్రపంచస్థాయి సినిమాలు తీయవచ్చని ఇప్పుడిప్పుడే అందరూ తెలుసుకొంటున్నారు. "పెళ్ళిచూపులు"తో సినిమా నిర్మాణంలో సరికొత్త ఒరవడి సృష్టించారు ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి. తాజాగా ఆయన నిర్మిస్తున్న చిత్రం "మెంటల్ మదిలో". న్యూ ఏజ్ యూత్ ఫుల్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీవిష్ణు-నివేతా పేతురాజ్ జంటగా నటిస్తుండగా యువ ప్రతిభాశాలి వివేక్ ఆత్రేయ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి కావచ్చిన ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు నేటితో మొదలయ్యాయ్.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. "ఈరొజు మెంటల్ మదిలొ టీం ఒక వినూత్న విధానంలొ హీరొ అరవింద్ కృష్ణ పాత్రని, ప్రముఖ దర్శకులు నటులు శ్రీ అవసరాల శ్రీనివాస్ ద్వారా ఫ్రేక్షకులకి పరిచయం చేశారు. జూలై చివరి వారంలో చిత్రాన్ని విడుదల చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాం. శ్రీవిష్ణు-నివేతాల జంట చాలా బాగుంది, శ్రీవిష్ణు నేచురల్ పెర్ఫార్మెన్స్, వివేక్ ఆత్రేయ టేకింగ్ "మెంటల్ మదిలో" చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి. మా ధర్మపధ క్రియేషన్స్ బ్యానర్ నుంచి వస్తున్న మరో మంచి చిత్రం "మెంటల్మదిలో" అని గర్వంగా చెప్పగలను" అన్నారు.
ఈ చిత్రానికి పి.ఆర్.ఓ: వంశీ శేఖర్, సినిమాటోగ్రఫీ: వేదరామన్, సంగీతం: ప్రశాంత్ విహారీ, ఎడిటర్: విప్లవ్ న్యాషాదమ్, నిర్మాత: రాజ్ కందుకూరి, దర్శకత్వం: వివేక్ ఆత్రేయ!
తాజా వార్తలు
- ఏపీ: రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం
- ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమంటూ తారిఖ్ రహ్మాన్ ప్రకటన
- తెలంగాణ: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు..
- సిత్రాలోని ఐన్ అల్ రహా సిఫార్సుకు కౌన్సిల్ ఆమోదం..!!
- రాస్ అల్ హర్క్ ఫారెస్టులో ఫైర్.. ఏవియేషన్ సహకారం..!!
- 2025లో 574,000 మున్సిపల్ లైసెన్సులు జారీ..!!
- పొగమంచులో ప్రయాణం..డ్రైవర్లకు సేఫ్టీ గైడ్ లైన్స్..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..పొగమంచు, వర్షాలు..!!
- యూఏఈలో డీలర్ల వద్దకు BMW కార్ల ఓనర్లు క్యూ..!!
- కేంద్ర రోడ్డు నిధి కింద రోడ్డు మరమ్మత్తుల పై ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి









