డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు ఆహ్వానించిన మోదీ
- June 26, 2017
భారత్‌కు రావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కుటుంబసభ్యులను ప్రధాని నరేంద్రమోదీ ఆహ్వానించారు. 'మీ కుటుంబసభ్యులతోపాటు మీరు భారత్ రావాల్సిందిగా నేను సాదరంగా ఆహ్వానిస్తున్నాను. మీకు భారత్‌లో ఆహ్వానం పలికి అతిథ్యమిచ్చే అవకాశాన్ని నాకు ఇవ్వండి' అని మోదీ కోరారు. వైట్‌హౌస్‌లోని రోజ్‌గార్డెన్స్‌లో ట్రంప్‌తో కలిసి సంయుక్త మీడియా ప్రకటన చేసే సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
తమ మధ్య తొలిసారి జరిగిన దౌత్య సమావేశంలో మోదీ-ట్రంప్ విస్తారంగా చర్చించుకున్నారు. అత్యంత స్నేహపూర్వక వాతావరణంలో ఇద్దరు మంతనాలు జరిపారు. ఏకాంతంగా 20 నిమిషాలపాటు మాట్లాడుకున్నారు. మోదీకి పదే పదే ధన్యవాదాలు తెలిపిన ట్రంప్.. తమ సంభాషణ ఎంతో ఫలప్రదంగా సాగిందంటూ హర్షం వ్యక్తం చేశారు. భారత్-అమెరికా మధ్య స్నేహం, పరస్పర గౌరవం గతంలో ఎన్నడూలేనిరీతిలో గొప్పగా కొనసాగనుందని ట్రంప్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ట్రంప్ కూతురు ఇవాంకను ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ ఏడాది ఉత్తరార్ధంలో భారత్‌లో జరిగే గ్లోబల్ ఎంటర్ప్రీనుర్షిప్ సదస్సుకు వచ్చే అమెరికా పారిశ్రామికవేత్తలకు ఇవాంక నేతృత్వం వహించాలని మోదీ కోరారు. తన ఆహ్వానాన్ని ఆమె అంగీకరించిందని భావిస్తున్నట్టు చెప్పారు.
భారత్‌కు రాబోతున్న ట్రంప్!
ఇక మోదీ ఆహ్వానాన్ని అంగీకరించిన ఇవాంక ట్రంప్ ఆయనకు ట్విట్టర్లో శుభాకాంక్షలు తెలిపింది. మరోవైపు భారత్‌కు రావాలన్న ప్రధాని మోదీ ఆహ్వానాన్ని డొనాల్డ్ ట్రంప్ సైతం అంగీకరించారు. ఆయన త్వరలో భారత్‌కు రానున్నట్టు వైట్‌హౌస్ ధ్రువీకరించింది. అయితే, ట్రంప్ భారత పర్యటనకు సంబంధించిన వివరాలేవీ ఇంకా వెల్లడించలేదు.
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్‌సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్‌లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









