షూటింగ్ లో పాల్గొని అందరికీ షాక్ ఇచ్చిన హీరో రవితేజ
- June 26, 2017
టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ తమ్ముడు.. నటుడు భరత్ రోడ్డు ప్రమాదంలో అత్యంత దారుణంగా మృతి చెందిన సంగతి విధితమే.. కాగా తన తమ్ముడు అంత్యక్రియలకు కాదు.. కడసారి చూపుకు కూడా రాని రవితేజ పై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతున్నాయి.. ఇక భరత్ ని చూడడానికి తల్లి కూడా రాకపోవడం అందరికీ దిగ్భ్రాంతిని కలిగించింది. తమ్ముడి ని చివరి సారి చూడడానికి రాకపోవడానికి రవితేజ ఇచ్చిన వివరణ తో ఎవరూ సంతృప్తి పడడంలేదు.. ఎంత చెడ్డవడైనా తమ్ముడేగా అని అనుకొంటున్న సమయంలో రవితేజ అందరికీ మరో షాక్ ఇచ్చాడు.. రవితేజ నటిస్తున్న తాజా సినిమా రాజా ది గ్రేట్ షూటింగ్ లో పాల్గొన్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ను వాయిదా వేద్దామని చిత్ర యూనిట్ భావిస్తున్న సమయంలో రవితేజ దర్శకుడికి స్వయంగా ఫోన్ చేసి.. షూటింగ్ క్యాన్సిల్ చేయకుండా కంటిన్యూ చేయమని చెప్పాడట.. అంతేకాదు.. అన్నపూర్ణ స్టూడియో జరుగుతున్న షూటింగ్ లో రవితేజ మెహ్రీన్ తో కలిసి పాల్గొన్నాడు.. రాజాది గ్రేట్ సినిమా షూటింగ్ యధావిధిగా జరుగుతున్నది. కాగా రవితేజ సినిమా వాయిదా వేస్తే.. నిర్మాత నష్టపోతాడు అని భావించి ఇలా చేస్తున్నాడా...! లేక మరేదైనా కారణం ఉన్నదా అని ఫిల్మ్ ఇండస్ట్రీ గుసగుస..
తాజా వార్తలు
- అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఇన్ఫ్లుయెన్సర్
- పెయింటింగ్ లో విశ్వగురు వరల్డ్ రికార్డ్ సాధించిన చిన్నారి ప్రవ్య అదిత్రి
- చంద్రయాన్-4 ల్యాండింగ్ సైట్ ఫిక్స్
- ఘనంగా విశ్వగురు వరల్డ్ రికార్డు స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డ్స్ వేడుక
- భయం వల్లే ప్రధాని మోదీ లోక్‌సభకు రావట్లేదు: రాహుల్ గాంధీ
- విశాఖ టు చెన్నై..క్రూయిజ్ షిప్ విహారానికి ఏర్పాట్లు
- మున్సిపల్ ఎన్నికల్లో మధ్య త్రిముఖ పోటీ: సీఎం రేవంత్
- మచిలీపట్నం పోర్ట్ అభివృద్ధికి కీలక నిర్ణయాలు: ఎంపీ బాలశౌరి
- ఖతార్ లో ముగిసిన ఆర్ట్ బాసెల్ ఫస్ట్ ఎడిషన్..!!
- రియాద్‌లో వరల్డ్ డిఫెన్స్ షో 2026 ప్రారంభం..!!









