కోచ్ గోపీ చంద్ వల్లే విజయాలు.. వరల్డ్ కప్ లో విజయమే లక్ష్యం- కిదాంబి శ్రీకాంత్

- June 26, 2017 , by Maagulf
కోచ్ గోపీ చంద్ వల్లే విజయాలు.. వరల్డ్ కప్ లో విజయమే లక్ష్యం- కిదాంబి శ్రీకాంత్

రెండు వారాల వ్యవధిలోనే రెండు సూపర్‌ సిరీస్‌ లు గెలుచుకోవడం సంతోషంగా ఉందని భారత్‌ బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌ చెప్పారు. ఆస్ట్రేలియా ఓపెన్ సిరీస్‌ గెలుచుకొని అర్ధరాత్రి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న ఆయనకు కుటుంబ సభ్యులు, బ్యాడ్మింటన్ అభిమానులు ఘన స్వాగతం పలికారు.  కోచ్ పుల్లెల గోపీ చంద్‌ వల్లనే వరుసగా విజయాలు సాధిస్తున్నానని శ్రీకాంత్‌ తెలిపారు. వచ్చే వరల్డ్‌ కప్‌ పోటీల్లో గెలుపొందడమే తన లక్ష్యమని వివరించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com